Central on Maoists (imagecredit:twitter)
తెలంగాణ

Central on Maoists: మావోయిస్టుల పతనం పూర్తయినట్టేనా.. చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా!

Central on Maoists: గత రెండేళ్లుగా నక్సల్స్ వర్సెస్ ఫోర్సెస్ గా కొనసాగుతున్న రణరంగంలో భద్రతా బలగాలదే పై చేయిగా కనిపిస్తోంది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని అబూజ్మాడ్ కేంద్రంగా మావోయిస్టులపై విరుచుకుపడుతున్న కేంద్ర భద్రత బలగాల వలయంలో మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. నాటి నుంచి ఆపరేషన్ కగార్ వరకు మావోయిస్టులపై కేంద్ర భద్రత బలగాలు పట్టు సాధిస్తూనే వస్తున్నారు. అనుకోని రీతిలో 2023 నుంచి నేటి వరకు వందలకొద్ది మావోయిస్టులను ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రత బలగాలు మావోయిస్టులపై ఉక్కు పాదం మోపాయి. అనతి కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యులను టార్గెట్ గా చేసుకుంటూ కూంబింగ్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నంబాల కేశవరావు సహా అగ్రనేతలుగా 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు కొనసాగుతున్నారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.

ఇక మిగిలింది 15 మంది మాత్రమే

ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ వారి జీవన గమనంపై దృష్టి సారిస్తూ వారిని మట్టు పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు స్వర్గ ధామమైన అబూజ్ మడ్ కేంద్రంగా మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఇక అక్కడ తమకు సేఫ్ జోన్ గా అవకాశం లేదని కోణంలోనే మావోయిస్టులు తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రానికి అనుకొని ఉన్న కర్రెగుట్టల ప్రాంతానికి మావోయిస్టులు భారీగా చేరిపోయారు. విషయాన్ని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను అబూజ్ మడ్ నుండి నేరుగా కర్రెగుట్టల ప్రాంతానికి దాదాపుగా 15 వేల మంది భద్రతా బలగాలను రంగంలోకి దించింది. అంతేకాకుండా ఎన్ఐఏ చీప్ తపన్ డేక నువ్వు సైతం అక్కడికి పంపించి మావోయిస్టుల కదలికలను పసిగడుతూ వారిలో ఒక్కొక్కరిని మట్టుపెట్టే ప్రయత్నంలో పట్టు సాధించింది. అంతేకాకుండా హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా మావోయిస్టుల ఆచూకీ కోసం పర్యవేక్షిస్తూనే అనుమానం వచ్చిన చోటల్లా పైనించే బాంబుల వర్షం కురిపించారు. ఈ ధాటికి మావోయిస్టులు చెల్లాచెదురుగా పుట్టకొకరు చెట్టుకొకరుగా అయిపోయారు.

ఇక మిగిలింది 15 మంది మాత్రమే

ఇదే సమయంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలని కొనసాగించారు. కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులపై కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రత బలగాలు పట్టు సాధిస్తుండడంతో అక్కడి నుంచి మావోయిస్టులు మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల ప్రాంతాలకు వెళ్లిపోయారు. విషయాన్ని పసిగట్టిన భద్రత బలగాలు సైతం మావోయిస్టులను వెంబడిస్తూ వారిని అంతం చేసేంతవరకు వదిలేది లేదని కూంబింగ్లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు మరో ఇద్దరిని భద్రత బలగాలు మట్టి పెట్టాయి. ఇక కేంద్ర కమిటీ సభ్యులు 15 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారికోసం భద్రతా బలగాలు ప్రత్యేక ప్రణాళిక రచించి వారిని వెంటాడడమే ధ్యేయంగా మధ్య భారతంలో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్న టార్గెట్ రీచ్ కావాల్సిన తేదీ మార్చి 31 2026 వరకు ఈ మిగిలి ఉన్న కేంద్ర కమిటీ 15 మంది సభ్యులను వేటాడి వెంటాడి అంతం చేయడమే ధ్యేయంగా పోలీసులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని సమాచారం.

Also Read: Minister Sithakka: అమ్మాయిల స్వీయ రక్షణకు.. బాలికా రక్షక టీంలు!

చివరి అధ్యాయం మాత్రమే మిగిలి ఉందా?

1970 దశకంలో భూస్వాములు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఎదిరించడమే ధ్యేయంగా స్థాపించబడిన అండర్ గ్రౌండ్ పార్టీ అనతి కాలంలోనే నక్సలైట్ గా మారి ఆ తర్వాత మావోయిస్టులుగా చెలాయించబడుతున్నారు. నాటి నుంచి దాదాపు 2004 సంవత్సరం వరకు నక్సలైట్ల చలామణి సాగింది. అప్పుడు కూడా నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య చర్చల సమయం ఆసన్నమైనప్పటికీ అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు తమ పట్టు వీడకుండా చర్చలు మధ్యలోనే సఫలం కాకుండా విఫలమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు మావోయిస్టులు తమ పంథాను సాగిస్తూ వస్తున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి మావోయిస్టులు తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా షెల్టర్లు తీసుకుంటూ తమ విధివిధానాలను సాగించారు.

మావోయిస్టులకు సేఫ్ జోన్

అనతి కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై నిఘా వ్యవస్థతో ఎప్పటికప్పుడు వారి కదలికలను తెలుసుకుంటూ వెంబడిస్తూ వస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉన్న మావోయిస్టులంతా ఛత్తీస్గడ్ లోని అంబుజమద్ అటవీ ప్రాంతాల్లో చేరిపోయారు. అక్కడ సైతం మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరి స్తుండడంతో అక్కడ సైతం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా లేకుండా పోయింది. ఇటీవలనే మావోయిస్టులంతా కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న 287 ఎకరాల్లో తలదాచుకున్నట్లుగా తెలిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బలగాలను చతిస్గడ్ రాష్ట్ర వివిధ రకాల బలగాలను అక్కడికి పంపించింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ప్రాంతాన్ని సైతం చుట్టుముట్టి మావోయిస్టులకు శ్వాస తీసుకునే సమయం ఇవ్వకుండా దాడులను చేపట్టింది. ఆ తర్వాత చత్తీస్గడ్ రాష్ట్రానికి చేరుకున్న మావోయిస్టులను అనుసరిస్తూనే భద్రతా బలగాలు కూంబింగ్లను నిర్వహిస్తూ వస్తున్నారు.

మావోయిస్టులను చివరి అంకం దశకు

ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మావోయిస్టులకు చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల పతనం దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ప్రభుత్వ విధివిధానాల ద్వారా అర్థమవుతుంది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాల్సిన తేదీ ఇప్పటికి మరో 9 నెలల కాలం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాలు మావోయిస్టులను చివరి అంకం దశకు చేరుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. గత రెండేళ్ల కాలంలో మావోయిస్టులను దాదాపు ఏరివేసిన కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలు ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి కేంద్ర కమిటీలో కొనసాగుతున్న మరో 15 మందిని మట్టు పెట్టడం పెద్ద సమస్య కాదని నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతోంది. చిన్నాచితక మావోయిస్టులంతా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఛత్తీస్గడ్ రాష్ట్రంలో లొంగిపోయేందుకు వరుసగా క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం కేంద్ర కమిటీలో కొనసాగే 15 మంది కీలక, అగ్రనేతలే టార్గెట్ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ముందుకు వెళుతోంది.

Also Read: Arrest Virat Kohli: విరాట్ కోహ్లీకి ఊహించని పరిణామం.. అల్లు అర్జున్ ఫొటోలు వైరల్

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!