Telangana
తెలంగాణ

Telangana: ఉపాధిలో తెలంగాణ పరుగులు.. ప్రత్యేక వ్యూహం

Telangana: తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ‘ఉపాధి’ పరుగులు పెడుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ పనులు చేసి గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా బాసటగా నిలిచింది. గ్రామీణ అనుసంధానం పనుల కింద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద వ్యవసాయ పొలాలకు రాష్ట్ర వ్యాప్తంగా 12,010 రోడ్లను నిర్మించి రికార్డు సృష్టించింది. పశువుల షెడ్లు సైతం 12వేల నిర్మాణం చేపట్టింది. వర్షపు నీటి సేకరణ కోసం 1224 రూప్ టాప్‌ల నిర్మాణం చేపట్టింది. ఒక వైపు గ్రామీణులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడుతున్నది.

అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి

ప్రజలు (People) ఉపాధికోసం వలస బాట పట్టకుండా నివారించేందుకు కేంద్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, పథకం చేపట్టిన సదుద్దేశ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తున్నది. ప్రతి ఏటా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో రాష్ట్రంలో వివిధ పనుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. రైతన్నకు బాసటగా నిలుస్తున్నది. మరోవైపు, భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టని విధంగా 2024-25లో పనులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతుండడంతో మట్టిరోడ్లను వేసేందుకు శ్రీకారం చుట్టింది. రైతుల (Farmers) నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో 12,010 మట్టిరోడ్ల నిర్మాణం చేపట్టింది. అంతేగాకుండా 2,598 కిలో మీటర్లు సీసీరోడ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీలో భాగంగా చేపట్టారు. పశువుల షెడ్లు సైతం 12,247 చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫౌల్ట్రీ షెడ్లు 500, మేకలు గొర్రెల షెడ్లు 1551, అజోల్లా ఉత్పత్తి యూనిట్ 453, ఎన్ఏడీఈపీ-వర్మికంపోస్టు యూనిట్లు 1187, ఫారం పాండులు 5,026 నిర్మించారు.

Read Also- Akhil Wedding: కొడుకులతో కలిసి కింగ్ నాగ్ ఏ పాటలకు డ్యాన్స్ చేశారో తెలుసా?

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం

ఉపాధి హామీలో భాగంగా రాష్ట్రంలోని పలు పాఠశాల (School) ల్లో మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టారు. 5827 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్ 3366, కిచెన్ షెడ్‌లు 2401 నిర్మాణం చేశారు. భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భజలాల పెరుగుదలకు వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు 1224 రూప్ టాప్‌లు చేపట్టారు. బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్షర్ 127, చెక్ డ్యాంపులు 154, పెర్కోలేషన్ ట్యాంకులు 2811 నిర్మించారు.

రూ.4529 కోట్లతో పనులు

2024-25లో రాష్ట్రంలో రూ.4529.07 కోట్లతో పనులు చేపట్టారు. ప్రజలకు 12.23కోట్ల పనులు కల్పించారని అధికారులు వెల్లడించారు. సగటున ఉపాధి రోజులు 45.82 రోజులు కల్పించారు. సగటు వేతన రేటు రూ.213 అని పేర్కొన్నారు. అదేవిధంగా వేతనాల కోసమే 2614.3 కోట్లు కేటాయించగా, మెటీరియల్ వ్యయం రూ.1685.52కోట్లు, అడ్మిన్ వ్యయం రూ.229.25కోట్లు అని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2023-24లో 4072.56కోట్లతో పనులు చేపట్టగా, 2024-25లో 456.51కోట్ల పనులు ఎక్కువగా చేశారు.

ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం

గ్రామీణ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పిస్తున్నాం. వారు ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు ఆర్ధికంగా భరోసా ఇస్తున్నాం. నిత్యం అధికారులతో మానిటరింగ్ చేయడంతో పాటు పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపాధిహామీలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పశువుల షెడ్లు, ఫౌల్ట్రీ షెడ్లు, మేకలు గొర్రెల షెడ్లతో పాటు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24లో 12.09కోట్ల పని దినాలు కల్పించాం. 2024-25లో 12.23కోట్ల పని దినాలు కల్పించాం- మంత్రి సీతక్క

Read Also- Single OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘సింగిల్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!