Celebrity Engagement: ఒక వైపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగితే.. మరో వైపు నటి, బిగ్ బాస్ ఫేమ్ అయిన నటితో నిర్మాత అజయ్ మైసూర్ (Ajay Mysuru) నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఆ బిగ్ బాస్ ఫేమ్ ఎవరని అనుకుంటున్నారు కదా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందడి చేసిన శుభశ్రీ (Subhashree Rayaguru). అజయ్ మైసూర్, శుభశ్రీల నిశ్చితార్థ వేడుకకు సెలబ్రిటీలెందరో హాజరయ్యారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar) ఫ్యామిలీతో హాజరవగా.. సోహైల్‌తో పాటు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా ఈ వేడుకలో సందడి చేశారు.
Also Read- Bunny Vas: పెద్ద హీరోలనూ ఉద్దేశిస్తూ బన్నీ వాస్ చేసిన పోస్ట్ వైరల్.. ఎంత ధైర్యం?
ఇదే నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభశ్రీ (Ajay Mysuru and Subhashree Rayaguru Engagement) కలిసి చేసిన ‘మెజెస్టీ ఇన్ లవ్’ సాంగ్‌ను (Majesty in Love song launch) లాంఛ్ చేశారు. సాయి కుమార్ వాయిస్‌తో ఈ పాట ప్రారంభం కావడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. ‘మెజెస్టీ ఇన్ లవ్’ సాంగ్‌ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి, సింగర్ సాహితీ చాగంటితో కలిసి ఆలపించారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే వీరి మనసులు కలిశాయని తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అజయ్ మైసూర్, శుభశ్రీ వివాహం జూలైలో ఆస్ట్రేలియాలో జరగనుంది.
Also Read- Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు మరోసారి వాయిదా!
ఈ ఎంగేజ్‌మెంట్, సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ.. నిర్మాత అజయ్ మైసూర్ నాకు మంచి మిత్రులు. ఆయన మా ఇంటికి వచ్చి ఎంగేజ్‌మెంట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హీరో సోహైల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలందరూ ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో సరదాగా కనిపించారు. ‘మెజెస్టీ ఇన్ లవ్’ సాంగ్‌కు పనిచేసిన టీమ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని.. పాటను స్టేజ్‌పై ఆలపించారు. నిర్మాత అజయ్ మైసూర్ విషయానికి వస్తే.. అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్’ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శుభశ్రీ రాయగురు విషయానికి వస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2022లో వచ్చిన ‘రుద్రవీణ’ అనే సినిమాతో పరిచయమైంది. ‘అమిగోస్’, ‘కథ వెనుక కథ’ వంటి చిత్రాలలో నటించిన ఆమె 2023లో జరిగిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7తో అందరికీ పరిచయమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు