Bunny Vas: రెండు మూడు హిట్ సినిమాలు తీశాడో లేదో.. నిర్మాత బన్నీ వాస్ పెద్ద హీరోలకు సూచనలు చేసేంత స్థాయికి వెళ్లిపోయాడా? అని అంతా అనుకోవచ్చు. కానీ, మంచి విషయం చెప్పేటప్పుడు చిన్నా, పెద్ద అని ఆలోచించకూడదు. ఆయన చెబుతున్న కంటెంట్‌లో ఉన్న విషయం ఏమిటనేది ముందు గ్రహించాలి. అందులో వాస్తవం ఉంటే, సాధ్యమైనంత త్వరగా ఆ కంటెంట్‌పై ఓ డెసిషన్‌కి రావాలి. అంతేకానీ, నువ్వేంత.. నీ స్థాయి ఎంత? అనుకుంటూ కూర్చుంటే అక్కడ కొంపలంటుకుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్య దూరం కావాలంటే, ఇలాంటి నిర్మాతలు ఇచ్చే సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతకాలం అని అలాగే ఆ సమస్యను వాయిదా వేసుకుంటూ వస్తారు. ప్రాబ్లమ్ ఏంటో తెలుసు? దానికి సొల్యూషన్ కూడా తెలుసు. కానీ ఎవరూ అందుకు పూనుకోకపోవడంతో.. ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. నాలుగైదు రోజులు హడావుడి అనంతరం యథా రాజా! తథా ప్రజా! అన్నట్లుగా మారిపోతుంది. అందుకే ఎంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడితే.. అంత ఇండస్ట్రీకి మంచిదని బన్నీ వాస్ వంటి వారంతా చెబుతున్నారు.
Also Read- Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు మరోసారి వాయిదా!
ఇప్పుడు కూడా బన్నీ వాస్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు (Single Screen Theaters) లేకపోతే ఎవరికి నష్టమో? ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం విశేషం. ఈ విషయంలో ముఖ్యంగా పెద్ద హీరోలు (Tollywood Heroes) కూడా ఆలోచించాలి. అలా చేయలేదంటే, వారికే నష్టం. సింగిల్ స్క్రీన్స్ ఉన్నంత వరకే వారి ఆటలు సాగుతాయి. సింగిల్ స్క్రీన్ లేకుండా కేవలం మల్టీప్లెక్స్‌లోనే (Multiplex Theaters) అంటే మాత్రం సినిమాలు తీయడానికి నిర్మాతలెవరూ ముందుకు రారు. ఎందుకంటే వారికి వచ్చే పర్సేంటేజ్ అలాంటిది. ఆ లెక్కలన్నీ గమనిస్తే.. వారికి రూపాయి కూడా మిగలదు. అలాంటప్పుడు ఏ నిర్మాత అయినా సినిమాలెందుకు చేస్తాడు. అప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే.. ఈ సమస్యపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది అనేది అర్థమవుతోంది. అసలింతకీ బన్నీ వాస్ ఏం పోస్ట్ చేశారంటే..
Also Read- Mother: షాకింగ్.. సమాజంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?
‘‘ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అనేది! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే.. థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్లయితే.. ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమాకు థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుంది’’ అని బన్నీ వాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు