Sridhar Babu (Image Source: Twitter)
తెలంగాణ

Sridhar Babu: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6 వేల ఉద్యోగాలు.. మంత్రి ప్రకటన

Sridhar Babu: తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్ గణనీయమైన పురోగతి సాధించిందని మంత్రి అన్నారు. గత ఏడాది టాస్క్ కారణంగా 4,100 మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ఉద్యోగ నియామకాలు పొందేలా భారీ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని అధికారులకు సూచించారు.

నిరుద్యోగులకు అండగా టాస్క్!
గడచిన ఏడాది కాలంలో టాస్క్ సంస్థ.. రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక, నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 21 జిల్లాల్లోని 148 కళాశాలు, పలు కంపెనీల ప్రాంగాణాల్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో 4100 మంది ప్రతిభావంతులు ఉద్యోగాలు పొందడంలో టాస్క్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వెరిస్క్ ఎనలైటిక్స్ అనే అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి 11 లక్షల ప్యాకేజితో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుందని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన మొత్తం 4100 మందిలో కనీస వార్షిక ప్యాకేజి రూ.2.4 లక్షలుగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.

7,000 మందికి శిక్షణ
హ్యుండాయ్ మోబిస్ సంస్థ టాస్క్ ద్వారా 42 మందికి శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించుకుందని శ్రీధర్ బాబు చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) 6 లక్షల వార్షిక ప్యాకేజితో 63 మందిని రిక్రూట్ చేసుకుందని అన్నారు. 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ఫౌండేషన్ తెలంగాణలో ఏర్పాటు చేసిన గ్రీన్ స్కిల్స్ అకాడెమీ ద్వారా 7,000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు.. గతేడాది డిసెంబర్ లో ఐక్యరాజ్యసమతి న్యూయార్క్ లో నిర్వహించిన గ్లోబల్ సదస్సుకు హాజరయ్యారయ్యారని పేర్కొన్నారు.

Also Read: TPCC Mahesh Kumar Goud: కేసీఆర్‌తో ఈటల కుమ్మక్కు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

మూడేళ్లలో 10వేల మందికి..
దివ్యాంగులైన యువతకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా టాటా ట్రస్ట్ తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీ మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మూడేళ్ల పాటు టాటా సంస్థ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. యనిమేషన్, గేమింగ్, వీఎఫ్ ఎక్స్, కామిక్స్ లో యువతకు 3 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు ట్వాగా (Tvaga) అనే సంస్థతో సైతం టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి అన్నారు. వచ్చే మూడేళ్లలో XR monk అనే కంపెనీ ద్వారా 10 వేల మంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ లో అత్యాధునిక శిక్షణ ఇస్తామని చెప్పారు.

Also Read This: NEET PG 2025: నీట్ పరీక్షపై బిగ్ అప్‌డేట్.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?