Mithra Mandali: రెండు రోజుల క్రితం ప్రీ లుక్‌తో సందడి చేసిన పోస్టర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది. నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) గీతా ఆర్ట్స్‌ని వదిలి స్వయంగా బ్యానర్ స్థాపించి చేస్తున్న చిత్రమిదని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడా చిత్రానికి ‘మిత్ర మండలి’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ లుక్‌లో ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగిన విషయం తెలిసిందే. ఈ పిక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Also Read- Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు మరోసారి వాయిదా!
ఈ సినిమాకు ‘మిత్ర మండలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌తో కలిపి వదిలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ‘మిత్ర మండలి’కి సంబంధించిన వారెవరో కూడా రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా మేకర్స్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్‌ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వడానికి సిద్ధమవుతుందనేలా ఈ ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. (Niharikha NM) ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తుండటం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక NM.. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిసి వర్క్ చేసి వార్తల్లో నిలిచారు. అందుకు సంబంధించిన వీడియో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఆమె సిద్ధమైంది.
Also Read- Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రియదర్శి గురించి చెప్పేదేముంది… అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆయన ఎప్పుడో సొంతం చేసుకున్నారు. ఆయనకు ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి ‘మిత్ర మండలి’తో అదిరిపోయేలా ఎంటర్‌టైన్ చేస్తారనడంలో సందేహమే లేదు. బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపుదిద్దుకుంటున్న ఈ మ్యాడ్‌నెస్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు