Etela Rajender (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Etela Rajender: కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరంలో నా ప్రమేయం లేదు.. ఈటల

Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిషన్ జరుపుతున్న విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో ఈటల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ సూచించిన విధంగా బీఆర్ కే భవన్ లో జరుగుతున్న విచారణలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు కమిషన్ ఆయన్ను విచారించింది. అనంతరం బయటకు వచ్చిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈటల ఏమన్నారంటే?
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా ఆ రోజు డబ్బు కేటాయించడమే తన పని ఆయన పేర్కొన్నారు. అప్పటి క్యాబినేట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు కు నిధులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించి సొంతంగా తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన సాంకేతిక అంశాలు తనకు తెలియదని ఈటల అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కు నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఈటల రాజేందర్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్స్ ఎత్తుకు ఒప్పుకోలేదని 148 వరకే అంగీకరించిందని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్లామని పేర్కొన్నారు.

ఆ బాధ్యత కార్పొరేషన్ దే!
టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించినట్లు ఈటల రాజేందర్ చెప్పారు. ఆ తర్వాత కేబినెట్ మొత్తం బ్యారేజీలకు ఆమోదం తెలిపిందని అన్నారు. తొలుత రూ.63,000 కోట్లతోనే బ్యారేజీలను ప్రతిపాదించారని.. ఆ తర్వాత అది రూ. 85,000 కోట్లకు పెరిగిందని చెప్పారు. వాప్కోస్ తో డీపీఆర్ ప్రిపరేషన్, ఇతర స్టడీస్ కోసం రూ.59 కోట్లు కేటాయించారని.. దానికి కూడా కేబినేట్ ఆమోదం ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో నిధులు లేవని.. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. నిధులకు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధం లేదని.. ఆ వ్యవహారాల బాధ్యత కార్పొరేషన్ దేనని అన్నారు. బ్యారేజీల నిర్మాణం అనేది టెక్నికల్ కమిటీ చూసుకుందని ఈటల రాజేందర్ అన్నారు. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని.. టెక్నికల్ డెసిషన్స్ తాము తీసుకోలేమని చెప్పారు.

ఈటలకు ఎదురై ప్రశ్నలు ఇవే!
గంటపాటు జరిగిన విచారణలో ఈటల రాజేందర్ పై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందులో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా మరికొన్నింటిని దాట వేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కమిషన్: మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిది? అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా?

ఈటల: టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి. ఫైనల్ గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది.

కమిషన్: డీపీఆర్ కోసం రూ.59.7 కోట్లు వ్యాప్కోన్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?

ఈటల: నాకు తెలీదు

కమిషన్: డీపీఆర్ అప్రూవల్ క్యాబినెట్లో జరిగిందా?

ఈటల: అన్ని అనుమతులు క్యాబినెట్లో తీసుకున్నాం.

కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?

ఈటల: నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్సు పరిధిలోకి కార్పొరేషన్ రాదు.

కమిషన్: లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలని అనుకున్నారు?

ఈటల: కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు

కమిషన్: ప్రాజెక్టు నిర్మాణం.. హాఫ్ బడ్జెట్ లో జరిగిందా?

ఈటల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు

కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు?

ఈటల: ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్న టెక్నికల్ టీం చెప్తుంది.

కమిషన్: ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే ఏమంటారు?

ఈటల: అదంతా ఆర్థిక శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది.

కమిషన్: మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈటల: క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగింది

కమిషన్: రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?

ఈటల: మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు హరీష్ రావు చైర్మన్ అయిన ఆ సబ్ కమిటీలో నేను తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాం. నిపుణల కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది – ఈటెల రాజేందర్.

కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?

ఈటల: అవును, సంతకం చేసింది.

Also Read: Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?