Akhil Zainab Wedding
ఎంటర్‌టైన్మెంట్

Akhil Zainab Wedding: అఖిల్ పెళ్లిలో చైతూ హల్చల్.. సెలబ్రిటీల సందడి మొదలైంది

Akhil Zainab Wedding: అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి జూన్ 6న, తన ప్రియురాలు జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో అంగరంగ వైభవంగా జరిపేందుకు కింగ్ నాగార్జున అన్నీ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఈ పెళ్లికి సంబంధించి మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ, పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు వేదిక అన్నపూర్ణ స్టూడియోస్ అని వినిపించింది. కానీ, నాగార్జున చాలా ప్లాన్డ్‌గా ఈ పెళ్లిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గ్రాండ్‌గా జరుపుతున్నారు. అఖిల్, జైనబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి అతి తక్కువ మంది మాత్రమే హాజరవుతుండగా, రిసెప్షన్‌కి మాత్రం రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులెందరో హాజరు కానున్నారని తెలుస్తుంది.

Also Read- Akhil Zainab: అఖిల్, జైనబ్‌ పెళ్లి చేసుకోబోతుంటే.. ఇప్పుడీ వార్తలేంటి?

ఇక అఖిల్, జైనబ్‌ల వివాహం శుక్రవారం ఉదయం 9 గంటలకే అని తెలుస్తుంది. అందుకే తెల్లవారు జాము నుంచే నాగార్జున ఇంట్లో సెలబ్రిటీల సందడి మొదలైంది. సోషల్ మీడియాలో నాగార్జున ఇంటి దగ్గర మెగాస్టార్ చిరంజీవి దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, ఇంకా శర్వానంద్ దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి వారంతా కారు దిగి, ఇంట్లోకి వెళుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, పెళ్లికి ముందు జరిగిన సంగీత్‌లో అఖిల్ సోదరుడు, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య మాములు హడావుడి చేయలేదని తెలుస్తోంది. సంగీత్‌లో డీజేలతో డ్యాన్స్ ఇరగ్గొట్టేశాడని తెలిపేలా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో చైతూని చూసిన వారంతా.. ఒక కడుపున పుట్టకపోయినా, సోదరుల బంధం ఎంత గొప్పగా ఉంటుందో చైతూ, అఖిల్‌ని చూసి తెలుసుకోవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య డ్యాన్స్‌కి సంబంధించిన ఫొటోలతో అఖిల్ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్‌గా జరుగుతున్నాయనేది కూడా అర్థమవుతోంది.

సెలక్టెడ్ మెంబర్స్ మాత్రమే
ఇదిలా ఉంటే, ఈ మధ్య నాగార్జున ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా.. ఈ పెళ్లిని ఎంత గ్రాండ్‌గా చేసినప్పటికీ, అతిథులను మాత్రం లిమిటెడ్‌గానే నాగార్జున ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మార్నింగ్ 9 గంటలకే మ్యారేజ్ ఉండటంతో, అందరూ ఈ పెళ్లికి హాజరు కాలేరని భావించిన నాగార్జున, మొత్తంగా ఓ 100 మంది అతిథుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరపబోతున్నారట. తన కుటుంబ సభ్యులు, జైనబ్ కుటుంబ సభ్యులతో పాటు, ఇరు ఫ్యామిలీలకు అత్యంత సన్నిహితులైన బంధువులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారనేలా టాక్ వినబడుతోంది. జూన్ 8న జరిగే రిసెప్షన్‌కు మాత్రం అన్ని రంగాలలోని ప్రముఖులందరూ హాజరవుతారని సమాచారం.

Also Read- Manchu Vishnu: మంచు విష్ణు ఫోన్‌లో హాట్ లేడీ ఫోన్ నంబర్.. ఎవరో తెలిస్తే?

అఖిల్ పెళ్లాడుతున్న జైనబ్ రవ్జీ ఎవరంటే..
అఖిల్‌ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఓ పెళ్లి.. పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో ఈ పెళ్లిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కినేని ఫ్యామిలీ. ఈ క్రమంలో అఖిల్ పెళ్లాడుతున్న జైనబ్ గురించి నిశ్చితార్థం అనంతరం బీభత్సంగా సెర్చింగ్ జరిగింది. జైనబ్ విషయానికి వస్తే.. ఆమె పార్శీ ఫ్యామిలీలో జన్మించింది. జైనాబ్ తండ్రి జుల్ఫీ ఇండస్ట్రియలిస్ట్. ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. జైనబ్ పుట్టింది హైదరాబాద్‌లోనే. కానీ ఆమె ముంబైలో స్థిరపడ్డారు. బాలీవుడ్‌లో ఓ మూవీలో కూడా ఆమె నటించారు. ఆమె వృత్తి ఆర్టిస్ట్.. అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తుంటారు. ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం అఖిల్‌తో ఆమెకు పరిచయమైంది. ఆ పరిచయం ఇంత వరకు వచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..