Akhil Akkineni and Zainab Ravzi
ఎంటర్‌టైన్మెంట్

Akhil Zainab: అఖిల్, జైనబ్‌ పెళ్లి చేసుకోబోతుంటే.. ఇప్పుడీ వార్తలేంటి?

Akhil Zainab: రీసెంట్‌గా అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు జరిగాయి. నాగ చైతన్య, శోభితల పెళ్లి సాంప్రదాయబద్దంగా ఎంతో గ్రాండ్‌గా ఇరు కుటుంబ సభ్యులు జరిపిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి అయిన 5 నెలలలోనే అక్కినేని ఇంట మరో పెళ్లి జరుగుతుండటం విశేషం. కింగ్ నాగార్జున (King Nagarjuna) చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం (Akhil Akkineni Marriage) తన ప్రియురాలు జైనబ్ రవ్జీ (Zainab Ravzi)తో జూన్ 6వ తేదీన, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఇరు ఫ్యామిలీ మెంబర్స్ సన్నద్ధమయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు ఏం లీక్ కాకుండా కింగ్ నాగ్ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. గతంలో ఓసారి పెళ్లి పీటల వరకు వెళ్లి అఖిల్ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి పక్కాగా, ప్లాన్డ్‌గా అఖిల్ పెళ్లిని నాగ్ జరపబోతున్నారు. రీసెంట్‌గా నాగ చైతన్య, శోభితల పెళ్లి (Naga Chaitanya and Shobita Marriage) ఎలా అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, సెలక్టెడ్ సెలబ్రిటీల మధ్య జరిగిందో.. అఖిల్, జైనబ్‌ల పెళ్లిని కూడా అలాగే ప్లాన్ చేశారు.

Also Read- Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!

అందుకే అఖిల్ పెళ్లికి సంబంధించి కనీసం శుభలేఖను కూడా మీడియాకు దొరకనివ్వలేదు. జూన్ 6న వివాహం అనంతరం జూన్ 8వ తేదీన గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించేందుకు కింగ్ నాగ్ ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. మరి రిసెప్షన్‌కి అయినా అందరినీ పిలుస్తారో, ముఖ్యంగా అక్కినేని అభిమానులనైనా పిలుస్తారో.. లేదంటే తూ తూ మంత్రంగా అది కూడా పూర్తి చేస్తారో అనేలా ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకుంటూ ఉండటం విశేషం. ఇదే సమయంలో అఖిల్, జైనబ్‌ల వయసుకు సంబంధించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కారణం 31 ఏళ్లు నిండిన అఖిల్.. తనకంటే వయసులో 8 సంవత్సరాల పెద్దదైన జైనబ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. జైనబ్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. మరి వీరి మధ్య ప్రేమ, పెళ్లి ఎలా సెట్ అయ్యాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ వార్తలు వండుతున్నారు.

Also Read- Nagma: నగ్మా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఆమె లైఫ్‌లోని షాకింగ్ విషయాలు!

ఇక ఇటీవల జరిగిన నిశ్చితార్థంలో కాస్త బొద్దుగా కనిపించిన జైనబ్.. తాజాగా విడుదలైన ఫొటోలో మాత్రం చాలా స్లిమ్‌గా కనిపించి అందరికీ షాకిచ్చింది. నిజంగా ఆమెకు అంత వయసు ఉంటుందంటే ఎవరూ నమ్మరు కూడా. అలా మారిపోయారు. ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ జంట ఫొటోని చూస్తే.. పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్లుగా కనిపిస్తున్నారు. జంట చూడముచ్చటగా ఉందనేలా ఈ పిక్‌కి కామెంట్స్ పడుతున్నాయి. జైనబ్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ఆమె ఓ సినిమాలో కూడా నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. జైనబ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. ఇండియాలోనే కాకుండా దుబాయ్, లండన్‌లో కూడా ఆమెకు ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆమె అఖిల్‌కి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ టచ్‌లో ఉంటూ.. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఇంకొన్ని గంటల్లో జరిగే పెళ్లితో వివాహబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. పెళ్లి అనంతరం విడుదలయ్యే ఈ సినిమాతో ఆయన కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారని అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!