World Environment Day: భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచటంతో పాటు వాటిని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిపొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన గోల్కొండ ఏరియా హాస్పిటల్ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దిన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలసి మొక్కలు నాటారు.
మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని, చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయన్నారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో వచ్చే తరం కృత్రిమంగా ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. కాలుష్యం పెరిగి ప్రజలు క్యాన్సర్, షుగర్ వ్యాధులను బారినపడి మందులపై ఆధారపడుతున్నారని, కాలుష్యం పెరగకుండా ( Hyderabad) హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా హైదరాబాద్ ప్రకృతి కి మారు పేరుగా ఉండాలంటే ఇక్కడ మనం చెట్లు నాటాలన్నారు.
Also Read: GHMC Internal Changes: త్వరలో జీహెచ్ఎంసీలో.. అంతర్గత మార్పులు!
మొక్కలు నాటి ప్లాస్టిక్ ను మన జీవితం నుండి దూరం చేయాలి
కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ కి వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలని అన్నారు. తెలంగాణ మాది అనుకునే ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక శక్తి, పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటి ప్లాస్టిక్ ను మన జీవితం నుండి దూరం చేయాలని, మొక్కలు పెంచడం మన దిన చర్య గా భావించి బర్త్ డే లు, ఇతర ప్రత్యేక రోజులకు మొక్కలు నాటి ఓ మధుర అనుభూతిగా మల్చుకోవాలని మంత్రి సూచించారు.హైదరాబాద్ ( Hyderabad) జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) మాట్లాడుతూ చెట్టు నీడతో పాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని, చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని ప్రతి ఒక్కరూ చెట్టు ను నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని శుభ కార్యక్రమాల్లో కేకులను కట్ చేసి హంగామా సృష్టించే బదులు మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలన్నారు.
యంత్రాల కొనుగోలు కోసం రూ.1.80 మంజూరు
కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వాడే బదులు జూట్ బ్యాగులను వాడాలన్నారు. ఎమ్మెల్యే కౌసర్ మహియుద్దీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్నారు. గోల్కొండ ఆసుపత్రిలో ప్రతి రోజు 1200 నుండి 1500 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు.ఆసుపత్రిలో కొత్త భవనం నిర్మించేందుకు రూ.6 కోట్లు , యంత్రాల కొనుగోలు కోసం రూ.1.80 మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ పి. సురేష్, డీసీ హెచ్ ఎస్ సూర్య కుమారి, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు శ్రీనివాసరావు, కార్పొరేటర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు , గోల్కోడ ఏరియా హాస్పిటల్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Maoist Leader Killed: భారీ ఎన్‌కౌంటర్.. టాప్ కమాండర్ హతం!