Telangana CM Revanth reddy Mass Warning To KCR
Politics

Revanth Reddy: కారు, సారు.. ఇక రాలేరు.. కేసీఆర్ కొంగజపానికి ఓట్లు రాలవు

– బీజేపీ, బీఆర్ఎస్ దొందుదొందే
– మోదీ, కేసీఆర్ పాలనపై ఫైర్
– మూడోసారి వస్తే ముప్పులో దేశం
– కేసీఆర్ కొంగజపానికి ఓట్లు రాలవు
– హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే
– అన్ని వర్గాలకూ అండగా నిలుస్తాం
– ఎల్బీ నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, స్వేచ్ఛ: బస్సు యాత్ర పేరుతో మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసగించేందుకు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరాడని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎల్బీనగర్‌లో రేవంత్ రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిందని.. అది మళ్లీ రాదని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్‌కు ఇప్పుడు మళ్లీ ప్రజలు గుర్తుకు వచ్చారని, దొంగజపం చేసే కొంగ మాదిరిగా యాత్రల పేరుతో ఓట్లడుగుతున్న కేసీఆర్‌ను నమ్మకండని ప్రజలకు సూచించారు.

కేసీఆర్‌ టార్గెట్‌ వంద రోజుల కాంగ్రెస్‌ ప్రభుత్వమా? పదేండ్లుగా ప్రజలను దగా చేసిన బీజేపీ ప్రభుత్వమా? చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అసలు ఈ విషయాన్నీ ప్రస్తావించడంలేదన్నారు.వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆర్.. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు ప్రణాళిక రచిస్తు్న్న మోదీని ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. గతంలో తాను మల్కాజ్‌గిరిలో పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు రోజూ సమావేశాలు పెట్టిన కేటీఆర్‌.. ఈ ఎన్నికల్లో ఎక్కడా కనబడటం లేదని, అటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గురించీ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. దీనిని బట్టే వారిమధ్య ఒప్పందం ఉందని అర్థమవుతుందన్నారు.

బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇవ్వాలని అడుగుతున్న ప్రధాని మోదీ, పొరబాటున గెలిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. మెట్రో ప్రాజెక్టు కావాలని అడిగితే బీజేపీ నేతలు ‘జైశ్రీరామ్’ అంటున్నారని, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటే ‘హనుమాన్ జయంతి నిర్వహించాం’ అని బదులిస్తున్నారని సెటైర్ వేశారు. దేవాలయంలో ఉండే దేవుడిని బీజేపీ రోడ్డు మీదికి తెచ్చి, ఆ పేరుతో ఓట్లడగటం ఏమిటని నిలదీశారు. ఇన్నేళ్లు తెలంగాణ ప్రజలు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి జరుపుకోలేదా? బీజేపీ వాళ్లు వచ్చాకే ఈ పండుగలన్నీ జరుగుతున్నాయో ఆలోచించుకోవాలని ఓటర్లకు సూచించారు. మోదీ, కేసీఆర్ కలిసి గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచారని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని, అందుకు కాంగ్రెస్ సిద్ధమన్నారు. కానీ ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కాంగ్రెస్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలు సమాధానం చెప్పడం లేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే తెలంగాణ బీజేపీ నేతలెవరూ దానిమీద ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు.

Also Read: మ్యాచ్ ఫిక్సింగ్ .. బస్సు మిస్సింగ్

ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రాబోతుందన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. జంట నగరాల్లో మెట్రో రైలు అవ్వడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. మెట్రో రైలును వైస్సార్‌ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌లు తీసుకువచ్చింది తమ పార్టీయేనని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత కూడా తమదేన్నారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్