- ఖాళీ స్థలం కనిపిస్తే అంతా మాదే అంటారు
- లాబీయింగ్‌తో దోచుకెళ్తున్న కార్పొరేట్ సంస్థలు
- టెంప్ట్ అయి మోసపోతే కాపాడేవారే కరువు
- గత ప్రభుత్వంలో పీక్ స్థాయిలో లాభపడ్డ ఫినిక్స్
- భూముల మాటున వైట్ కాలర్ దందాలెన్నో?
- వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కోట్లలో వసూలు
- మహా జాదూ.. ఓరుగంటి సుబ్బారావు!
- స్కాం వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
- సీసీఎస్‌లో కేసు.. అయినా మారని తీరు
- ఇలాంటి దొంగలు ఇంకెందరో?
- నష్టపోతున్న ఎన్నారైలు, మిడిల్ క్లాస్ రియల్ వ్యాపారులు
- ఇప్పుడైనా ఆ మిగులు భూములపై చర్యలు ఉంటాయా?
- గతంలో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పేరుతో ‘స్వేచ్ఛ’ కథనాలు
- గచ్చిబౌలి భూముల్లో భూ జాదూగర్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Gachibowli Lands: గచ్చిబౌలిలో గజం భూమి 4 లక్షలు పెట్టినా దొరకదు. అలాంటి ప్రైమ్ ఏరియాలో మొదటి నుంచి 130 ఎకరాల స్థలం వివాదాస్పదంగా ఉన్నది. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్లకు కాసుల పంటే. మై హోం లాంటి సంస్థలకు అసైన్డ్ భూములను ఏపీఐఐసీ అలియాస్ టీఎస్ఐఐసీ (TSIIC) లాంటి ఎజెన్సీతో కట్టబెట్టి కోట్లాది రూపాయలు పరోక్షంగా లాభాలు పొందినవారు ఎందరో. ఫినిక్స్ (Phoenix) లాంటి సంస్థలు ఏ ప్రభుత్వం ఉంటే వారికి స్క్వేర్ ఫీట్స్ రాయించి ఇచ్చి దందాలు చేస్తున్నది. ఇలాంటివన్నీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల వేల కోట్ల డీలింగ్స్ వ్యవహారాలు. ఇవి సామాన్యులకు అవసరం లేని కథనాలు. కానీ, ఎన్‌ఆర్‌ఐలను, కామన్ రియల్టర్స్‌ను ముంచే జాదుగాళ్ల వందల కోట్ల మోసం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీఎస్‌లో దీనిపై కేసు నమోదైంది. ఇలాంటి వ్యవహారాలపై సీరియస్‌గా తీసుకొని ఫోర్జరీ గాళ్లను, ఫేక్ డ్యాకుమెంట్ల క్రియేటర్స్‌ను కఠినంగా శిక్షించాలి. ఆన్లైన్ సైబర్ మోసాలతో లక్షలు మోసపోతాం కావచ్చు. కానీ, ప్రభుత్వ భూమిని, కోర్టులో కేసులు ఉన్న వాటిని ఆసరాగా చేసుకొని చేస్తున్న దందాతో కోట్లాది రూపాయలు సమర్పించుకుని కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చాయి. అందుకే ఈ ఓరుగంటి సుబ్బారావు (Oruganti Subbarao) మోసం తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి.
ఓరుగంటి స్కాం కథలు ఇవే..
ఉయ్యూరు నుంచి పైసా లేకుండా ఊపుకుంటూ హైదరాబాద్ (Hyderabad) కు వచ్చిన మోసగాడు ఈ ఓరుగంటి సుబ్బారావు. మీకు 5 కోట్లు పెట్టినా రాని 500 గజాల ప్లాట్ కోటికి వస్తుంది అంటూ గచ్చిబౌలి (Gachibowli) లోని సర్వే నెంబర్ 37, 40లలో జనం నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న ఘనుడు. కూతురు పెళ్లి ఇతర రాష్ట్రాల్లో చేసి, రిసెప్షన్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెట్టాడంటేనే అర్థం చేసుకోండి. చివరకు బాధితులు మోస పోయాం డబ్బులు ఇవ్వమంటే తాను ఎస్టీని, అట్రాసిటీ కేసు పెడుతా అంటూ బెదిరిపులకు పాల్పడుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఈయన ఓసీలతో బంధుత్వం కలుకున్నాడు. ఇలాంటి గజదొంగలు గచ్చిబౌలిలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు. కొందరు కార్పొరేట్ స్థాయిలో వేల కోట్లు దోచుకుంటుంటే, ఇలాంటి వాళ్లు సామన్యులను వందల కోట్లకు ముంచుతున్నారు.
Read Also- Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. బాలికపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్!
వీళ్లు చెప్పే చరిత్ర ఇదే?
1991లో కలెక్టర్ అనిల్ కుమార్ శెట్టి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 37 నుంచి 40 వరకు 99 ఎకరాలు మోబైట్ వెల్ఫర్ అసోసియేషన్‌కు ఇచ్చారని ప్రెసిడెంట్ ధర్మరాజు తనకు జీపీఏ చేశారని చెప్పుకుంటూ ఓరుగంటి సుబ్బారావు వందల కోట్లు వసూలు చేశాడు. తన కుటుంబంలోని సభ్యులతో శ్రీ ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. అందులో 128 మందికి సభ్యత్వం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటికి అందిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపు 50 కోట్ల వరకు తీసుకున్నాడు. బాధితుల్లో ఎన్నారైలే చాలామంది ఉన్నారు. 2005 నుంచే యాక్టివ్‌గా లేని మొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను 2013లో తనకు జీపీఏ చేశారని పేపర్స్ సృష్టించుకున్నాడు. 2020లో ప్రెసిడెంట్ ధర్మారాజు చనిపోయారు. అయినా అతని సంతకాలతో, ఆనాటి కోర్టు ఆర్డర్స్‌ను మేనేజ్ చేస్తూ బాధితుల్ని నమ్మిస్తూ వస్తున్నాడు. దీనికి సంబంధిచిన అన్ని సాక్ష్యాధారాలను స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ సంపాదించింది. అయితే, సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ అయిందని సమయం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ తీసుకుని పోలీసుల ముందు హాజరయ్యాడు. సుబ్బారావుపై 2016లో చీటింగ్ కేసు, కేకే లాంటి ఫ్యామిలీతో ల్యాండ్ డీలింగ్స్ మోసాలు లాంటి దందాలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికీ పోలీసులు వైట్ కాలర్ నేరస్థుడిగా కాకుండా చీటింగ్, కాన్‌స్పిరెన్సీ కింద దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి.
ఎన్నో కథనాలు రాసిన ‘స్వేచ్ఛ’
గచ్చిబౌలి సర్వే నెంబర్ 35 నుంచి 50 వరకు జరిగిన భూ బాగోతాలపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ ఎన్నో కథనాలు ఇచ్చింది. లింగమ్మ భూముల చరిత్ర నుంచి లింగమయ్య గౌడ్, మేకపాటి ఫ్యామిలీ, వయా ఫినిక్స్ లాంటి కార్పొరేట్ సంస్థల బాగోతాలు ఎన్నో క్లియర్‌గా ప్రజల ముందు ఉంచాం. ఇంకా కార్పొరేట్ ముసుగులో పబ్లిక్ స్థలాలను ఎలా కొల్లగొడుతున్నారో బయటపెడుతూనే ఉంటాం. ఇలాంటి మోసగాళ్ల బండారాన్ని, నేతలకు మేతలాగా తయారవుతున్న తీరును, అందుకు సహకరిస్తున్న అధికారుల వ్యవహార శైలిని ఎప్పటకప్పుడు ప్రజల ముందు స్వేచ్ఛాయుతంగా కథనాలు ఇస్తాం.
Read Also- Gold Rate ( 05-06-2025) : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్