Bunny Vas: బన్నీ వాస్ ఈ పేరు తెలియంది కాదు. గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌లో యంగ్ నిర్మాతగా అద్భుతమైన సినిమాలు చేస్తూ వస్తున్న బన్నీ వాసు.. ఇప్పుడు వేరు కుంపటి పెట్టాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటి వరకు అల్లు అరవింద్ రైట్ హ్యాండ్‌గా ఉన్న బన్నీ వాసు.. ఇప్పుడు ఓన్‌గా బ్యానర్ స్థాపించి మరో రెండు బ్యానర్లతో కలిసి ఓ అద్భుతమైన సినిమాను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.
Also Read- Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ అడ్వాన్స్ వెనక్కి.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
బన్నీ వాస్ వర్క్స్‌తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ట్రేడ్‌తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆయన ఓన్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ని సమర్పిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై మరింతగా నమ్మకం ఏర్పడుతోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప.. గతంలో బన్నీ వాస్‌తో కలిసి ‘తండేల్’ (Thandel) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ద్వయం ‘ఆయ్’ (Aay), ‘సింగిల్’ (Single) వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ బ్యానర్స్‌తో చేతులు కలుపుతుండటం.
Also Read- Prashanth Neel: ఆర్సీబీ విజయంతో ‘ఎన్టీఆర్‌నీల్’ సెట్స్‌లో ప్రశాంత్ నీల్ బీభత్సం
ఇక తాజాగా విడుదలైన ప్రీ లుక్ విషయానికి వస్తే.. ఈ ప్రీ లుక్ చూడగానే మ్యాడ్ నెస్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, నవ్వులను పూయించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిలబడి ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన పోస్టర్ ఇది. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్‌తో రోలర్ కోస్టర్‌ను ఈ ప్రీ లుక్ సూచిస్తుంది. జూన్ 6న చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో నిర్మాతులు ప్రకటించారు. ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథన శైలితో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని, ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు