telugu song in AIMIM political campaign for lok sabha elections 2024 ఎంఐఎం క్యాంపెయిన్‌లో తెలుగు పాట..
Asaduddin owaisi
Political News

AIMIM: ఎంఐఎం క్యాంపెయిన్‌లో తెలుగు పాట.. మార్పు మంచిదే..!

Telugu Song: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ల కోసం తెలుగు పాటను విడుదల చేసింది. ఎంఐఎంకు ఎక్కువగా ఓల్డ్ సిటీలో పట్టు ఉన్నది. హైదరాబాద్ లోక్ సభ సీటును 1984 నుంచి ఆ పార్టీనే గెలుచుకుంటూ వస్తున్నది. ఒవైసీ కుటుంబమే హైదరాబాద్ లోక్ సభకు అత్యధికంగా ప్రాతినిధ్యం వహించింది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా ముస్లింలు ఉండటం, వారు ఎక్కువగా ఉర్దూ, హిందీ భాషల్లో మాట్లాడటం మూలంగా ఎంఐఎం తమ ప్రచారంలో తెలుగు పాటలను ఎంపిక చేసుకోదు. వాళ్ల ప్రసంగాలు కూడా చాలా వరకు ఉర్దూలోనే సాగుతుంటాయి. కానీ, కొన్ని రోజులుగా ఎంఐఎం క్యాంపెయిన్‌లో కొన్ని మార్పులు వస్తున్నాయి.

గత పదేళ్లలో బీఆర్ఎస్‌తో అవగాహనతో బరిలోకి దిగిన ఎంఐఎం సులువుగా ఇక్కడి నుంచి గెలిచేది. బీఆర్ఎస్ అధికారం నుంచి పోవడం.. మరోవైపు బీజేపీ హైదరాబాద్ లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రచారం చేయడం వంటివి ఎంఐఎం పార్టీకి కొంత ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ముస్లిం సహా అన్ని వర్గాల మద్దతు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముస్లిం కమ్యూనిటీకి చెందిన నాయకుడిని బరిలో నిలపడం కూడా అసదుద్దీన్‌కు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఒవైసీ కేవలం ముస్లిం ఓట్లనే కాదు.. ఇతర కమ్యూనిటీ ఓట్లపైనే గురిపెట్టారు. గతంలోనూ అసదుద్దీన్‌కు ఇతర కమ్యూనిటీల ఓట్లు కూడా పడేవి. కానీ, ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.

Also Read: ఎంట్రీ ఇచ్చాడో లేదో సోషల్ వార్ మొదలైందిగా..!

ఎంఐఎం పార్టీ తమ పొలిటికల్ క్యాంపెయిన్‌లో తెలుగు పాటలను పెద్దగా ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తెలుగు పాటను ఒక ప్రచారాస్త్రంగా ఎంఐఎం మొదలు పెట్టింది. తాజాగా మరోమారు హైదరాబాద్ లోక్ సభ సీటు కోసం, ఎంఐఎం పార్టీ కోసం ప్రత్యేకంగా నల్గొండ గద్దర్ (కాసాని నర్సిరెడ్డి)తో పాడించి రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ పాట ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ చుట్టూతే ఉన్నది.

ఎంఐఎం పార్టీ జెండాతోపాటు చాలా చోట్ల జాతీయ జెండా ఈ పాటలో కనిపిస్తున్నది. అసదుద్దీన్ ఒవైసీ మతాలకు అతీతంగా అన్ని వర్గాలతో కలిసిపోవడం, ముస్లిం, సిక్కు, హిందూ గురువులను కలిసిన దృశ్యాలనూ ఈ పాట వీడియోలో చేర్చారు. అందరి నాయకుడని, అన్ని మతాలను గౌరవించే ప్రతినిధి అని ఈ పాటలో అసదుద్దీన్‌ను చిత్రించారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క