Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు గానూ తనకు ఇప్పటి వరకు అందిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతకు వెనక్కి ఇచ్చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా.. విడుదల కష్టాలను ఎదుర్కొంటోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా దాదాపు 5 సంవత్సరాలు చిత్రీకరణకు తీసుకోవడం, మధ్యలో టెక్నీషియన్స్ మారడం వంటి పరిణామాలతో.. నిర్మాతకు ఆర్థిక భారం ఎక్కువైందని, ఫైనాన్షియర్లు కూడా తమ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే సినిమా విడుదల కావాలంటూ హుకుం జారీ చేయడంతో.. నిర్మాత చిక్కుల్లో పడిపోయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ఇలా జరగడానికి కారణం, ఇన్నిసార్లు వాయిదా పడటానికి కారణం కేవలం పవన్ కళ్యాణే అని అందరికీ తెలుసు.
Also Read- Prashanth Neel: ఆర్సీబీ విజయంతో ‘ఎన్టీఆర్‌నీల్’ సెట్స్‌లో ప్రశాంత్ నీల్ బీభత్సం
ఆయన పొలిటికల్‌గా బిజీగా కావడంతో పాటు ప్రజా సేవకు అంకితమవడంతో.. ‘హరి హర వీరమల్లు’ ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసు. ఒక నిర్మాత 2 సంవత్సరాల టైమ్‌ని లెక్క పెట్టుకుని సినిమా స్టార్ట్ చేస్తే.. ఆ సినిమాకు 5 సంవత్సరాలు పట్టిందంటే.. వడ్డీలు ఏ విధంగా పెరిగిపోతాయో ప్రత్యక్షం తెలిసిన వ్యక్తి కావడంతో.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు తనకు అందిన అమౌంట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు, ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ఆయన ఎంత రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారనేది తెలియదు కానీ, ఇప్పటి వరకు నిర్మాత ఎ.ఎమ్ రత్నం నుంచి తనకు రూ. 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ అందిందట. ఆ అమౌంట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేస్తున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలా చాలా సార్లు చేశారు. తన నిర్మాత కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే చాలు.. తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తను దర్శకత్వం వహించిన ‘జానీ’ సినిమాకు వచ్చిన నష్టాలను ఆయనే భరించారు. తన నిర్మాతలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడంటూ.. అప్పుడే టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ఆలస్యానికి కారణం ఆర్థిక భారం కాదని, విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదనేలా కూడా టాక్ నడుస్తుంది. అందుకే జూన్ 3న సెన్సార్ కావాల్సిన ఈ సినిమా, అందుకు వెళ్లలేదనేది తాజా కబుర్. ఏ విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read- Allu Ayaan: ఆర్సీబీకి తొలి కప్.. అల్లు అయాన్‌కి ఏమైంది? వీడియో వైరల్!
మరోవైపు, ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందనేలా టాక్ బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం యుఎస్‌లో జూన్ 11న పడాల్సిన ప్రీమియర్స్ అన్నీ రద్దవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే యుఎస్‌లోని మేజర్ ఛైన్స్ అయిన సినిమార్క్ వంటివి జూన్ 11న పడాల్సిన ప్రీమియర్ షోస్‌ని రద్దు చేయడంతో.. ‘హరి హర వీరమల్లు’ విడుదల విషయంలో ఫ్యాన్స్ మరోసారి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి ఈ సినిమా అనుకున్న టైమ్‌కి విడుదల అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 8న తిరుపతిలో జరిగే ప్రీ రిలీజ్ వేడుక వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వేడుకలో అన్నింటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, నిర్మాత వైపు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా మరోసారి వాయిదా (Hari Hara Veera Mallu Postponed) అనే వార్తలపై క్లారిటీ రాలేదు. వాయిదా అని ఆయన కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు