Ram Charan: సాధారణ మనుషులకు వచ్చినట్టే.. సెలబ్రిటీలకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే, అవి మనకి తెలిసినప్పుడు మనం షాక్ అవుతాము. కొన్ని జబ్బులు విన్నప్పుడు వీటిని కూడా ఆరోగ్య సమస్యలు అంటారా అని కొత్తగా ఉంటుంది. ఎందుకంటే, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే, వాటిని మనం ఎక్కువ ఆలోచించము. అయితే, ఇవే మనిషికి పెద్ద తల నొప్పిగా మారతాయి.
Also Read: The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే?
మనమంటే వాటి గురించి పట్టించుకోము నటి నటులు మాత్రం కొత్త కొత్త పేర్లు పెట్టి మరీ అలాంటి సమస్యలు ఉన్నాయని పోస్టులు పెడుతుంటారు. అయితే, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఓ వింత సమస్య ఉందంటూ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం. దీనికి సంబందించిన వీడియో హల్చల్ చేస్తుంది. అయితే, అసలు ఆ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Tamannaah Bhatia: ఆ స్టార్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. కొత్త బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుందా?
రామ్ చరణ్ ( Ram Charan )మతి మరుపు సమస్యతో చాలా బాధ పడుతున్నాడంటూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి గల కారణాలు కూడా చెప్పాడు. సెట్ లో తనకి నచ్చిన పేరు పెట్టి పిలుస్తాడు. ఆ వ్యక్తి నా పేరు అది కాదని చెప్పిన కూడా చరణ్ తన నోటికి ఏ పేరు వస్తే దానితో పిలుస్తూ అందరి పేర్లను మార్చేస్తూ తొందరగా మర్చిపోతాడని చెప్పారు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఈ విషయాలను బయట పెట్టారు. ఇక రామ్ చరణ్ కూడా తనకు ఉన్న సమస్యను ఒప్పుకున్నారు.