Ritu Varma: టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి రీతూ వర్మ. తెలుగు అమ్మాయిలకు గుర్తింపు రాదనే నానుడిని తొలగిస్తూ.. బిజీ హీరోయిన్‌గా ఈ భామ దూసుకెళుతోంది. అయితే, ఆమెకు పడాల్సిన విధంగా సినిమాలు పడలేదనే చెప్పుకోవాలి. అలాగే స్టార్ హీరోలను కూడా ఈ భామ ఆకర్షించలేకపోతుంది. అయినా, బిజీ నటిగానే వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంది. ఇప్పుడామె మరో స్టెప్ ముందుకేసింది. ఇప్పటి వరకు వెండితెరపై సందడి చేసిన ఈ భామ, ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Nagarjuna Family: అక్కినేని ఇంట్లో గొడవలా? అఖిల్ పెళ్లి వేళ చైతూ సంచలన నిర్ణయం!
రీసెంట్‌గా జియో హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమైన ఓటీటీలో.. హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా ‘దేవిక అండ్ డానీ’ (Devika and Danny) అనే వెబ్ సిరీస్ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల వంటి వారంతా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బి. కిషోర్ (B Kishore) దర్శకత్వంలో సుధాకర్ చాగంటి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ సిద్ధమైన సందర్భంగా.. మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల నుంచి వెబ్ సిరీస్ ఒకటి చేయాలని అనుకుంటున్నాను. కొన్ని కాన్సెప్ట్స్ నా దగ్గరకు వచ్చాయి కానీ, ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వస్తే చేద్దామనుకున్నాను. అలాంటి కాన్సెప్ట్ కోసం ఎదురు చూసే క్రమంలో.. అందుకే ఇంత వరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. ఇలాంటి సమయంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత సుధాకర్‌కు థాంక్స్. ఆయన మంచి సినిమాలను, సిరీస్‌లను అందించాలనే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఇంకా ఇలాంటి సిరీస్‌లు, సినిమాలను ఎన్నింటినో ఆయన చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కిషోర్ చాలా సరదాగా ఉండే వ్యక్తి. చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. వెంకట్ దిలీప్ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్‌పై చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అనేది నాకు అర్థమవుతుంది. మా డానీ సూర్య ఎంతో హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా ఇన్‌వాల్వ్ అయ్యి నటించాడు. సుబ్బు పాత్రలో నటించిన శివ కందుకూరి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సుబ్బరాజు, కోవై సరళ సహా ఎంటైర్ టీమ్‌కు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని కోసం నందిని ఎంతో హార్డ్ వర్క్ చేసింది. చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవని డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ అలాంటి వారికి ఈ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలనని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు