Rana Naidu Season 2 Trailer
ఎంటర్‌టైన్మెంట్

Rana Naidu Season 2: ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి యుద్ధమే!

Rana Naidu Season 2: వివాదాస్పద వెబ్ సిరీస్‌గా పేరు పొందినా, ఆదరణలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్. 2023లో ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఎలాంటి ఆదరణను రాబట్టుకుందో, ఎలా వార్తలలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడలాంటి సిరీస్‌కు సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మేకర్స్ ఈ సీక్వెల్‌కి సంబంధించి ఇస్తున్న అప్డేట్స్, చెబుతున్న మాటలు వింటుంటే.. ఈసారి యుద్ధమే అనేలా టాక్ మొదలైంది. దానికి తగ్గట్లుగానే వచ్చిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వస్తుందా? అని ఎదురు చూసేలా చేస్తుంది. ఈసారి ఫిక్సర్ కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో ప‌డుతుంది. సాధార‌ణంగా త‌న క్లైంట్స్ కోసం స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేసే రానా నాయుడు.. ఈసారి త‌న కుటుంబం కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. కుటుంబం ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు నియ‌మ నిబంధ‌న‌ల‌కు సంబంధించిన హ‌ద్దుల‌ను అత‌ను దాటుతున్నట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు.

Also Read- Nagarjuna Family: అక్కినేని ఇంట్లో గొడవలా? అఖిల్ పెళ్లి వేళ చైతూ సంచలన నిర్ణయం!

ఒక్కసారి సీజన్ 1ని గుర్తుకు తెచ్చుకుంటే.. ధనవంతులు, దురాశపరులు చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చే నైపుణ్య‌మున్న రానా నాయుడు.. వారు చేసిన నేరాల‌ను చెరిపేయ‌గ‌ల‌డు, జీవితాల‌ను తిర‌గ రాయ‌గ‌ల‌డు, భ‌యంకర‌మైన ర‌హ‌స్యాల‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాచేయగలడు. ప్ర‌పంచంలో ఎలాంటి ప‌నినైనా చేయ‌గ‌ల రానా, త‌న తండ్రి నాగ నాయుడుని మాత్రం ఎదుర్కొన‌లేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సంద‌ర్భంలో కొడుకు జీవితంలోకి నాగ నాయుడు ప్ర‌వేశించాల్సి వ‌స్తుంది. ఎవ‌రికీ తెలియ‌ని ఓ గ‌తాన్ని మోసే టైం బాంబ్‌ వంటి వ్య‌క్తి నాగ నాయుడు. నాయుడు కుటుంబం ఏ పనిని అసంపూర్తిగా చేయరు. ఈ విషయంలో తండ్రీ కొడుకులు కూడా ఆ బంధాన్ని మరిచిపోయి పోటీ పడుతుంటారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఇప్పుడొచ్చిన సీజ‌న్‌2 ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి మ‌రింత తీవ్రతరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి వారు ఎదుర్కొనబోయే ప్రమాదం వారి వ్యక్తిగతమైనదిగా తెలుస్తుంది. పాత గాయాల‌కు ప‌గ తీర్చుకోవాల‌ని గ‌తం కోరుకుంటున్నట్లుగా చూపించారు. అందులో ర‌వుఫ్‌- రానాకు స‌మాన‌మైన శ‌త్రువు. త‌న ప‌గ‌ను తీర్చుకోవ‌టానికి ఎలాంటి ప‌నినైనా చేయ‌టానికి వెనుకాడని వ్యక్తిత్వం తనది. రానా చిట్ట‌చివ‌ర‌గా ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నిని ఫిక్స్ చేయాల‌ని భావించి, ఆ ప్ర‌య‌త్నంలో అత‌ను చివ‌రి వ‌ర‌కు చేరుకుంటాడు. అది విజ‌య‌వంత‌మైతే అత‌ని కుటుంబ భ‌విష్య‌త్ మారిపోతుంది. అయితే రవుఫ్ రూపంలో అనుకోని తుపాన్ అతనికి ఎదుర‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య భీకరమైన యుద్ధం మొద‌ల‌వుతుంది. స‌మ‌యం అయిపోతూ, దారులు మూసుకుపోతుంటాయి. ఇలాంటి ప‌రిస్థితులను రానా నాయుడు అదుపులోకి తెచ్చుకోగ‌ల‌డా? లేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడా? అనేది ఈ సీజన్ 2లో చూపించబోతున్నారనేది ఈ ట్రైలర్ చెప్పేస్తుంది. సుర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సీజ‌న్‌ 2లో ఆక‌ట్టుకునే యాక్ష‌న్‌, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండ‌నుందనే విషయం ఈ ట్రైలర్‌లోని ప్రతి షాట్ తెలియజేస్తుంది. జూన్‌13 నుంచి ‘రానా నాయుడు సీజ‌న్‌2’ కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!