Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫస్ట్ టైమ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ‘ఖుషి’ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం.. ఈ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ ప్రమోషనల్ ఈవెంట్‌లో కనిపించలేదు కానీ, దర్శకనిర్మాతలు, హీరోయిన్ మాత్రం ప్రమోషన్స్‌ని అన్ని చోట్ల నిర్వహిస్తూ వస్తున్నారు.
Also Read- Chiranjeevi: మీలాంటి ఒక అభిమాని వున్నందుకు గర్వంగా ఉంది.. చిరు ట్వీట్ వైరల్!
ఇక ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాల్గొనే ఏకైక ఫంక్షన్ ప్రీ రిలీజ్ వేడుక. ఈ వేడుకకు సంబంధించిన డిటైల్స్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ (Hari Hara Veera Mallu) వేడుకకు సంబంధించి డేట్, వేడుక జరిగే స్థలాన్ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ వేడుక ఏడుకొండలవాడి సన్నిధిలో జరగబోతుంది. అర్థం కాలేదా? ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక జూన్ 8వ తేదీ ఆదివారం జరగనుంది. ప్రస్తుతం ముంబైలో ‘ఓజీ’ షూట్‌లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్.. ఈ వీకెండ్‌కు తిరుమల చేరుకుని, శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్సయినట్లుగా టాక్ నడుస్తుంది.
Also Read- Nidhi Agarwal Marriage: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ స్టార్ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి?
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఫస్ట్ టైమ్ ‘హరి హర వీరమల్లు’కి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ పంచుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించకపోవచ్చు. ఇంటర్వ్యూలు కూడా ఎవరికీ ఉండవని తెలుస్తుంది. కేవలం ఇతర ఆర్టిస్ట్‌ల ఇంటర్వ్యూలు మాత్రమే ఉంటాయని టాక్ వినబడుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎటువంటి అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదలవుతున్న సమయంలో థియేటర్ల బంద్ అనే అంశం బాగా హైలైట్ అయింది. అది సినిమాని అందరిలోకి తీసుకెళ్లి.. సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. మరోవైపు ఓవర్సీస్‌కు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హాట్ కేకుల్లా టికెట్స్ బుక్ అవుతుండటం చూస్తుంటే.. ‘ఓజీ’ వరకు ఆగాల్సిన పనిలేదు.. హరి హర వీరమల్లే రికార్డులు తుడిచిపెట్టేలా ఉన్నాడని ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు