Karnataka HC - Kamal Haasan (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Karnataka HC – Kamal Haasan: కమల్ దూకుడుకు బ్రేక్.. హైకోర్ట్ సైతం చివాట్లు.. ఇక తగ్గాల్సిందే!

Karnataka HC – Kamal Haasan: కన్నడ భాష పై లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటక (Karnataka)లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ పై అధికార, విపక్ష పార్టీలతో పాటు కన్నడ భాషా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు కమల్ లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ (Thug Life) జూన్ 5న విడుదల కావాల్సి ఉండగా.. కర్ణాటకలో దానిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మూవీ రిలీజ్ కు క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ సోమవారం కర్ణాటక హైకోర్టును కమల్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నటుడికి చురకలు అంటించింది.

హైకోర్టు ఏమన్నదంటే?
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతడి స్వీయ నిర్మాణంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని అడ్డుకుంటామని.. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రకటించింది. దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించగా.. న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న వ్యాఖ్యలను.. ఏ ఆధారాలతో చేశారని ప్రశ్నించింది. మీరేమైనా చరిత్రకారులా అని నిలదీసింది. అంతేకాదు తన వ్యాఖ్యలపై కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సూచించింది. కమల్ సారీ చెబితే సమస్య వెంటనే పరిష్కారమవుతుందని హైకోర్ట్ అభిప్రాయపడింది.

హైకోర్టును కమల్ ఏం కోరారంటే?
తన తాజా చిత్రం థగ్ లైఫ్.. విడుదలకు కర్ణాటకలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో కమల్ కోరారు. సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్‌ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని తన నిర్మాణ సంస్థ ద్వారా కమల్ హాసన్ కోరారు. అయితే కమల్ ఆశించిన దానికి విరుద్ధంగా హైకోర్ట్ తీర్పు ఇవ్వడం.. లోకనాయకుడికి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

Also Read: Covid-19 Cases India: కరోనా డేంజర్ బెల్స్.. ఏకంగా 4వేల కేసులు.. ఆందోళనలో ప్రభుత్వాలు!

వివాదం ఎక్కడ మెుదలైంది!
ఇటీవల జరిగిన ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కమల్ హాసన్.. కన్నడ భాష గురించి మాట్లాడారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ అతడు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై అధికార, విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి. మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే.. ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించాయి. అయితే తాను మాట్లాడిన దాంట్లో తప్పులేదని.. కన్నడ భాషపై ఉన్న ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పారు. క్షమాపణ డిమాండ్లను తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కమల్ సారీ చెబుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read This: Post Office Schemes: పోస్టాఫీస్‌‌లో టాప్-5 స్కీమ్స్.. ఐదేళ్లలో లక్షాధికారులు మీరే!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు