Nidhi Agarwal Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ నెలలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది వినగానే కొందరు ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటని అనుకుంటున్నారు. మరి, ఆమె పెళ్లి చేసుకోబోయే ఆ హీరో ఎవరు? తెలుగు హీరోనా ? లేక ఇతర భాష హీరోనా అనేది ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Tamannaah Bhatia: ఆ స్టార్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. కొత్త బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుందా?
అసలు ఈ ముద్దుగుమ్మ ఇంత సడెన్ గా ఎందుకు నిర్ణయం తీసుకుంది? అని ఇంకొందరు షాక్ అయి ఆరాలు తీస్తున్నారు. ఎప్పటినుండో నిధి అగర్వాల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
నిధి అగర్వాల్, శింబును పెళ్లి చేసుకోబోతుందా?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal)రిలీజ్ అయిన వెంటనే తమిళ హీరో శింబును ( Simbu ) పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇది తెలుగు వారికి కూడా తెలియడంతో వైరల్ అవుతోంది. అయితే, తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్.
Also Read: Tamannaah Bhatia: ఆ స్టార్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. కొత్త బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుందా?
నిధి అగర్వాల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!
నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకుంటున్నా అంటూ.. ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు రక రకాల వార్తలు క్రియేట్ చేశారు. ప్రతి సారి వీటిపై రియాక్ట్ అయి నేను టైమ్ వేస్ట్ చేసుకోలేను. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో నిజాలకు విలువ లేదులే.. రూమర్లనే ఎక్కువగా నమ్ముతారు. అందుకే ఆ వార్తలను వైరల్ చేస్తూ రక రకాలుగా రాస్తున్నారు. ఇలాంటి వాటిని నేను హార్ట్ కి తీసుకోను అంటూ పెళ్లి వార్తలపై రియాక్ట్ అయింది.