Kaleshwaram Vigilance Report: మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబరులో కుంగిన అనంతరం దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా లోపాలు ఉన్నాయని, 15 రకాల కారణాలను గుర్తించామని విజిలెన్స్ పేర్కొంది. డిజైన్లు, సీకెంట్ ఫైల్స్ ఏర్పాటు, పనిపూర్తయ్యాక కాఫర్ డ్యాంకు సంబంధించిన మెటీరియల్ తొలగించడం, పని పూర్తికాకముందే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, గడువు పొడింపులో లోపాలు, 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం జరిగిందని విజిలెన్స్ రిపోర్టులో పేర్కొంది.
క్రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగిందని, ఏజెన్సీ అత్యంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదిలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో, నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజినీర్లను నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్ జాయింట్ వెంటర్‌తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలను సైతం సిఫార్సు చేసింది.
Also Read: Complaints To Hydraa: నాలాల ఆక్రమణలపై ..హైడ్రాకు ఫిర్యాదులు!
2015 ఏప్రిల్ 15 నుంచి 2023 అక్టోబర్ 21 వరకు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కోరింది. అందులో వివిధ విభాగాల్లో కీలకమైన 17 మంది ఇంజనీర్లు, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. అదే విధంగా 33మంది ఇంజనీర్ల పై పెనాల్టీ వేయాలని, 7 మంది రిటైర్డ్ ఇంజనీర్ల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. క్షేత్ర స్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదిక లో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనాను రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ పరిశీలించకుండానే ఆమోదించిందని అయినా ఛీఫ్ ఇంజనీర్ ను కమిటీ ప్రశ్నించలేదని విజిలెన్స్ పేర్కొంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువ్ తయారీలో వైఫల్యం చెందారని, పర్యవేక్షణ లోపించిందని, స్టాండింగ్ కమిటీలోని సభ్యులందరిపైనా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేసింది. అదే విధంగా ఎలైన్ మెంట్ ఆమోదం, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ లేకుండా డ్రాయింగులను సీడీవోకు పంపారని, పంపు నీటిని తీసుకొనే కనీస నీటిమట్టంకు సంబంధించిన మోడల్ స్టడీస్ సపోర్టు లేకుండా బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని నిర్ణయించారని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకున్నారని, పనులు పూర్తికాకుండానే నీటినిల్వకు అనుమతిచ్చారని, సీకెంట్ ఫైల్స్ నిర్మాణాన్ని పర్యవేక్షించలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వానికి మార్చిలోనే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది.
అయితే ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు, 11 కేసీఆర్ కమిషన్ ముందుకు విచారణకు హాజరవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజిలెన్స్ కు సంబంధించిన రిపోర్టు మళ్లీ సోషల మీడియాలో వైరల్ అవుతుంది. కేసీఆర్ ను ఇరుకున బెట్టేందుకే మళ్లీ రిపోర్టును వైరల్ చేస్తున్నారా? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Also Read: Chamala Kiran Kumar Reddy: ఇంట్లో ఈటెల రాజేందర్ రెడ్డి.. గేట్ బయట ఓబీసీ నాయకుడు!