Opal Suchata Chuangsri( image credit: swetcha reporter)
తెలంగాణ

Opal Suchata Chuangsri: మిస్ వరల్డ్ కు గవర్నర్ సన్మానం.. హాజరైన సీఎం మంత్రులు!

Opal Suchata Chuangsri: రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అదే విధంగా విస్ వరల్డ్-2025 విజేత థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ, మొదటిరన్నరప్ హాసెట్ డెరెజే ఇథియోపియా, రెండో రన్నరప్ పోలాండ్ మాయా క్లైడా, మూడో రన్నరప్ మార్టినిక్ ఆరేలి జోచిమ్ పాల్గొన్నారు.

Also Read: Kaleshwaram project: కేసీఆర్ డేట్ మార్పు.. కోరిన సమయానికి ఓకే అన్న కమిషన్!

సుచాతా కు గవర్నర్ దంపతులు సన్మానం చేశారు. సుందరీమణులతో గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాలు వికసిత్ భారత్ ను సూచిస్తాయని, మీరు వెళ్లాక తెలంగాణ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మిస్ వరల్డ్ సుచాతా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. తెలంగాణ ఎప్పటికీ మనసులో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, రాజ్ భవన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: NEET Exam: నీట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!