Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ ఈ నెల 5న విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. అయితే తాను హాజరుకాలేకపోతున్నానని, ఈ నెల 11కు వస్తానని కమిషన్ కు సోమవారం సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ ఓకే చెప్పినట్లు సమాచారం. మరో రెండురోజుల్లోకి విచారణ ఉండగా కేసీఆర్ మరోవాయిదా కోరడం చర్చకు దారితీసింది. ఎందుకు ఆయన గడువుకోరారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయనిపుణులతో పలుమార్లు భేటీ అయ్యారు.కొందరు సాగునీటి రంగ నిపుణులు, నిపుణులతోనూ పలు సలహాలు తీసుకున్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసినట్లు సమాచారం. కమిషన్‌కు పూర్తి స్థాయి ఆధారాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Cm Revanth Reddy: పదేళ్ల నిర్లక్ష్యాన్ని చక్కదిద్దుతున్నాం.. సీఎం సంచలన వాఖ్యలు!
ఈ సమయంలో పూర్తిగా అధ్యాయనం చేయపోవడంతోనే కమిషన్ ను తగినంత సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణం, అందుకు గల కారణాలు, ప్రాజెక్టుతో సాగులోకి వచ్చిన విస్తీర్ణం, ప్రజలకు కలిగిన ప్రయోజనాలు కమిషన్ కు వివరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును గత కాంగ్రెస్ పాలనలో చేసిన వైఫల్యం, నిధుల దుర్వినియోగం సైతం వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే విచారణ కమిషన్ ఎదుట హాజరవడానికి ముందు సోమవారం(జూన్ 2న) మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, స్తితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీష్‌రావును కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించారు. భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు సమయంలో దీనిని రద్దు చేస్తున్నట్లు పార్టీ పేర్కొంది. ఎందుకు రద్దుచేశారో.. ఎప్పుడు మళ్లీ నిర్వహించేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ నెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారు.
Also Read: KTR – Kavitha: కేటీఆర్ వస్తేనే క్లారిటీ.. కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం!
కేసీఆర్ ఇంతకు కమిషన్ ముందు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హాజరయ్యే ఉద్దేశ్యమే ఉంటే ఎందుకు తేదీని పోస్టు ఫోన్ చేయించుకున్నారనేది చర్చకు దారితీసింది. ఒక వేళ హాజరైతే ఎలాంటి పరిణాలు ఉంటాయి, ఆయన చెబుతారనేది కూడా నేతలు చర్చించుకుంటున్నారు. లేకుంటే ఈ నెల 11వ తేదీ రోజూ కూడా పోస్టు ఫోన్ చేస్తారా? లేకుంటే న్యాయవాదులతో కేసీఆర్ చెప్పాలనుకున్న అంశాన్ని నివేదిక రూపంలో అందజేస్తారా? అనేది కూడా చర్చనీయాంశమైంది.
కమిషన్ ఎదుట హాజరుకాకుంగా గడువు కోరుతూ పోతే కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈటల, హరీష్ రావును కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందనే దాని పీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత కేసీఆర్ హాజరవుతారా? అనేది చూడాలి. ఏది ఏమైనా కేసీఆర్ గడువు కోరడం హాట్ టాపిక్ అయింది.
Also Read: MLC Kavitha: సమాజాన్ని సరైన బాటలో.. నడిపేదే కవిత్వం!