Revanth Reddy( image credit: twitter)
తెలంగాణ

Cm Revanth Reddy: పదేళ్ల నిర్లక్ష్యాన్ని చక్కదిద్దుతున్నాం.. సీఎం సంచలన వాఖ్యలు!

Cm Revanth Reddy: పదేళ్ల నిర్లక్ష్యాన్ని చక్కదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని వెల్లడించారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోవత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ…త్వరలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు క్యూ ఆర్ కోడ్ తో ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు. స్వేచ్ఛ,సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నా. గడిచినా పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టామన్నారు.అప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్నారు. కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదని, అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే తమ ఆచరణగా ముందుకు వెళుతున్నామన్నారు.

Also Read: MLC Kavitha: సమాజాన్ని సరైన బాటలో.. నడిపేదే కవిత్వం!

గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామన్నారు. నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ ఆర్ సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. 2047 డాక్యుమెంట్ పేరుతో ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నామన్నారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు.పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదని, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు.

Also Read: Telangana Formation Day: 3 ఏళ్లలో కేసీఆరే మళ్లీ సీఎం.. డల్లాస్‌లో కేటీఆర్ పవర్ ఫుల్ స్పీచ్

ఇక ఇందిరమ్మ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. కేవలం ఎనిమిది నెలల్లో 25లక్షల, 35వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నామన్నారు. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నామన్నారు.

వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నామన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు రీ ఎంట్రీ!

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించామన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వైద్యరంగంలో, పోలీస్, నీటిపారుదల, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ సంపూర్ణంగా పూర్తి చేశామన్నారు.

ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు.రూ.22,500 కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. నిజమైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామన్నారు. మరోవైపు 2047 నాటికి భారత దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతుందని, దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ సుందరీ పోటీలు నిర్వహించి ప్రపంచ ఆకర్షణను ఆకట్టుకున్నామన్నారు.

9 మందికి కోటి రూపాయల నగదు…
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ప్రజాపోరాటానికి స్పూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు సీఎం కోటి రూపాయలు నగదు బహుమతిని ప్రకటించారు. వీరిలో 8 మంది సోమవారం చెక్కులు అందుకున్నారు. గద్దర్, గూడ అంజయ్య, అందేశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ,జయరాజు, పాశం యాదగిరి, నలిమెల్ల భాస్కర్ లకు చెక్ లు అందించారు.

Also Read: Madhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు