Telangana Formation Day 2025 (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Formation Day 2025: మన టార్గెట్ అదే.. మీ సహకారం కావాలి.. సీఎం రేవంత్ గూస్ బంప్స్ స్పీచ్!

Telangana Formation Day 2025: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ అజెండా అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో (Telangana Formation day)సీఎం పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనాన్ని రేవంత్ స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

గత పదేళ్లలో రాష్ట్రం అస్తవ్యస్తం
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. తాము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్న సీఎం.. గత పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.

మహిళల అభివృద్ధికి బాటలు
కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజానికి పునాది మహిళలేనని అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాన్నానని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామని గుర్తుచేశారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామని చెప్పారు. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

క్యూఆర్ కోడ్‌తో ప్రత్యేక కార్డులు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలోని రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. మెుత్తం రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నామని చెప్పారు. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచామని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని.. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని గుర్తు చేశారు.

నిరుద్యోగులకు అండగా..
భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నట్లు చెప్పారు. యువతే మన భవిష్యత్తన్న సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16 నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించినట్లు చెప్పారు. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని గుర్తు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. వైద్యరంగంలో, పోలీస్, నీటిపారుదల, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు.

రిజర్వేషన్ల అంశంపై
రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపామని.. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చామని చెప్పారు. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. శాసనసభ, శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని.. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణలోకులగణన చేపట్టేందుకు సిద్ధమైందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలవర్గీకరణపై తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని సీఎం అన్నారు. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించామని.. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరపాలని నిర్ణయించామని చెప్పారు.

Also Read: IAS officer Alugu Varshini: వివాదాలకు కేరాఫ్‌గా ఐఏఎస్ అధికారిణి.. వర్షిణీపై ఎస్సీ కమిషన్ సీరియస్!

2047 నాటికి ప్రపంచంలోనే నెం.1
2047 నాటికి భారత దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతుందని రేవంత్ అన్నారు. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. అందుకే తెలంగాణ రైజింగ్-2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రమన్న సీఎం.. 2047నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని చెప్పారు. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలని సీఎం రేవంత్ కోరారు.

Also Read This: Panchayats In TG: పల్లె వాసులకు షాక్.. అటకెక్కిన కొత్త పంచాయతీల అంశం.. ఎందుకంటే?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?