Tribanadhari Barbarik: వెర్సటైల్ యాక్టర్, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్న ‘కట్టప్ప’ సత్య రాజ్ (Satya Raj) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదాల గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలై ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టైటిల్, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు చిత్ర ప్రమోషన్స్‌ని కూడా యమా జోరుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ థీమ్ సాంగ్ (Theme Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read- Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రుడు.. కమెడియన్ అలీపై బూతు మాట!
ర్యాప్ సాంగ్‌గా వచ్చిన ఈ లిరికల్ వీడియోని చూస్తే.. సినిమా కథ ఎలా ఉండబోతోందో క్లారిటీగా చెప్పేసినట్లుగా అనిపిస్తుంది. ఈ థీమ్ సాంగ్‌ను సనారే రచించగా.. కృష్ణ చైతన్య, సాయి చరణ్, శివ, హర్ష వర్దన్, వల్లి గాయత్రి, సింధూజ శ్రీనివాసన్, నాద ప్రియ, బృంద కలిసి ఆలపించారు. ఆదిత్య అయ్యంగార్ ఈ ర్యాప్‌ను పాడారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీ ఎంతో ఉత్తేజపర్చేలా, వినగానే ఎక్కేసేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘అనగా అనగా కథలా’ అనే పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అలాగే, ఎప్పుడూ లేనిది ఈ సినిమా కోసం డైరెక్ట్‌గా సత్యరాజే రీల్స్ చేయడం విశేషం. అదేమని అడిగితే.. సినిమాపై ఉన్న నమ్మకం అలాంటిది. ఒక గొప్ప చిత్రంలో నటించాను. గొప్ప పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం ఉంది. కచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని సత్యరాజ్ చెబుతూ వస్తున్నారు.
Also Read- Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!
సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించిన ఈ చిత్రంలో ఉన్న స్పెషల్ ఏంటంటే.. అందరికీ తెలిసిన ఉదయ భాను ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం. అవును ఇందులో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఓ మంచి రిలీజ్ డేట్ చూసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, త్వరలోనే ఆ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు