Nani Transgender Role: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ” ది పారడైజ్ ” అనే కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది. అయితే, ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు సరైన అప్డేట్ రాలేదు. గత కొద్దీ రోజుల క్రితం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను వదిలారు. అయితే, ఇది చూశాక మూవీ కాన్సెప్ట్ ఏంటి? దీనిలో నాని పాత్ర ఏంటని చాలా మందికి సందేహాలు వచ్చాయి. మాటలు, విజువల్స్, బీజీఎం అన్నీ అదిరిపోయాయి. మనం ఇంత వరకు చూడని నానిని చూపించబోతోన్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నాని ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Kabaddi Association: కబడ్డీ అసోసియేషన్‌లో కుంభకోణం.. సంచలన విషయాలు వెలుగులోకి!
హీరో నాని చేసింది పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. ఇంత వరకు ఏ హీరో కూడా ఇలాగా చేయలేదు. ది పారడైజ్ సినిమాలో నాని మెడలో ఉండే చైన్ అందరూ చూశారు కదా.. దాని వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఆ చైన్ కి స్టార్ సింబల్ తో ఉన్న లాకెట్ ఒకటి ఉంటుంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్కేసులో కీలక మలుపు.. ప్రశ్నలను సిద్ధం చేస్తున్న అధికారులు!
దీని అర్ధం ఏమిటంటే.. మేల్ , ఫిమేల్ శక్తులు ఒకే చోట ఉన్నట్లు. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని ఒక ట్రాన్స్ జెండర్ పాత్ర చేయబోతున్నాడు. అలాంటి నిర్ణయం నాని తీసుకున్నాడంటే .. ఇది మామూలు విషయం కాదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప రికార్డు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇంత వరకు ఏ స్టార్ హీరోలు కూడా ఇలాంటి పాత్రలు ఎంచుకోలేదు, చేయలేదు కూడా.. తొలిసారి నాని ఎంచుకున్నడంటే సినిమాలో ఎలా నటించాడో చూడాలి.