Rajendra Prasad: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు ఏమైంది. వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుంది అంటారు కదా. అలాంటి మత్తు ఆయనని ఆవహించేసిందా? ఆయనతో ఎంత చనువుగా ఉండేవారైనా సరే, ఆఖరికి ఆయన లైఫ్ ఇచ్చినా సరే.. వారి పట్ల పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు కాస్త హుందాగా వ్యవహరించాలి. ‘ఆ నలుగురు’ సినిమా తీయడం కాదు.. ఆ నలుగురిలో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ వంటి స్టేచర్ ఉన్న వ్యక్తి.. ఆయన ఎంత కమెడియన్ అయినప్పటికీ, ఆ స్టేచర్‌కి తగ్గట్లుగా బిహేవ్ చేయాలి. మరి కావాలని చేస్తున్నాడో.. లేదంటే మనల్ని ఎవరూ తప్పుపట్టరులే అని అనుకుంటున్నారో తెలియదు కానీ.. రాజేంద్రుడుకి ఈ మధ్య పబ్లిక్ స్టేజ్‌లపై మాట్లాడేటప్పుడు బూతులు ఎక్కువగా వస్తున్నాయి. తన స్థాయి మరిచి ఆయన మాట్లాడుతున్న తీరు.. ఆయన అభిమానులనే కాదు.. సదరు ప్రేక్షకులను కూడా ఎంతగానో బాధపెడుతోంది.
Also Read- Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!
సెలబ్రిటీలు ఏది పడితే అది మాట్లాడితే.. పాత రోజులు కాదు, ఎవరికీ తెలియకపోవడానికి. టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో ఉన్నాం. ప్రతి వాడి చేతిలో ఫోన్, దానికి ఇంటర్నెట్ ఉంటుంది. మాట్లాడిన మరు నిమిషంలోనే అది అంతర్జాలంలో సంచరిస్తుందనే విషయం ఇంకా నటకిరీటీ తెలుసుకోకపోవడం విడ్డూరం. ఇంతకు ముందు ‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో డేవిడ్ వార్నర్ విషయంలో, ‘షష్టిపూర్తి’ సినిమాకు సంబంధించి జరిగిన ఓ వేడుకలో యాంకర్‌ని పిలిచిన తీరుతో రాజేంద్ర ప్రసాద్ విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తన తోటి నటుడు, కమెడియన్ అలీ విషయంలో దారుణాతి దారుణంగా నోరు జారి.. రాజేంద్ర ప్రసాద్ వార్తలలో నిలుస్తున్నాడు. అలీని అలా పిలిచే సరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈ మధ్య ఆయన పబ్లిక్ ఫంక్షన్లలో వ్యవహరిస్తున్న తీరుని తప్పుబడుతున్నారు.
వయసు మాత్రమే పెరిగింది.. బుద్ధి పెరగలేదు..!
కమెడియన్ అలీని కొవ్వెక్కి పచ్చి బూతు (ల***) తిట్టిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్..
ఏం మనుషులు రా బాబూ.. ఎందుకు ఇంత అహంకారం..?
ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాల్సిందేనా.. లేకుంటే నిద్ర పట్టదా..?#RajendraPrasad #Tollywood pic.twitter.com/OkomjZHiYx
— Nagarjuna (@pusapatinag) June 1, 2025
అసలేం జరిగిందంటే..
సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్‌సీసీలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్ వంటి వారంతా పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read- Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడు సుధీర్ బాబు ఘనమైన నివాళి
ఈ వేడుకకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏరా అలీ(Ali)గా… ఎక్కడ? ఇటు రా లం…డకా’ అంటూ నోరు జారారు. నిన్న విజయవాడలో ఎన్టీఆర్ అవార్డు అందుకుని వచ్చాను.. క్లాప్స్ కొట్టారా? అని అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. అడిగి మరీ కొట్టించుకుంటున్నావా? అని పక్కన ఉన్న మురళీ మోహన్ అనగానే.. ‘సిగ్గుండాలి’ అంటూ ఆయన మాటకు అందర్నీ ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ అనడం కూడా చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా అయితే.. మరోసారి రాజేంద్ర ప్రసాద్ తన మాటలతో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆయన బిహేవియర్ ఇలానే కొనసాగితే మాత్రం.. ముందు ముందు ఆయన పేరును ప్రేక్షకులు పలకడానికి కూడా ఇష్టపడరు. మరి ఇకనైనా రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్‌లో మాట్లాడే సమయంలో కాస్త హుందాగా వ్యవహరిస్తాడేమో చూడాలి. లేదంటే, ‘ఎవరైనా ఆయనకి చెప్పండయ్యా?’ అంటూ నెటిజన్ల కామెంట్స్‌కి, ట్రోలింగ్‌కి గురికాక తప్పదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు