Kabaddi Association (imagecredit:twitter)
తెలంగాణ

Kabaddi Association: కబడ్డీ అసోసియేషన్‌లో కుంభకోణం.. సంచలన విషయాలు వెలుగులోకి!

Kabaddi Association: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అసోసియేషన్​మాజీ జాయింట్​ సెక్రటరీగా పని చేసిన తోట సురేశ్​ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీష్​ యాదవ్​, కోశాధికారి శ్రీరాములు కలిసి నిధులను గోల్ మాల్ చేశారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..

స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్ తెలంగాణ

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్​ సెక్రటరీగా తోట సురేశ్​పనిచేశారు. కాగా, సంఘంలో నలభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న జగదీష్​యాదవ్, శ్రీరాములు కలిసి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో 60లక్షల రూపాయలను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను కూడా పక్కదారి పట్టించారని తెలిపారు. అసోసియేషన్​ కు అధికారికంగా ఒకే బ్యాంక్ ఖాతా ఉండగా జగదీశ్​ యాదవ్, శ్రీరాములు కలిసి అనధికారికంగా మరో అకౌంట్​ఓపెన్​చేసి దాని ద్వారా ఈ 60లక్షల రూపాయలను విత్​డ్రా చేశారని ఆరోపించారు.

Also Read: Indiramma Lands: పేదలకు ఇందిరమ్మ భూములు.. మంత్రి వెల్లడి!

తెలంగాణ ప్రీమియర్​కబడ్డీలీగ్

2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్​ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం కేటాయించిన1.20కోట్ల రూపాయలను కూడా దుర్వినియోగం చేశారని తెలిపారు. దీంట్లో 50లక్షల రూపాయలను సొంత అవసరాలకు వాడుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రీమియర్​కబడ్డీలీగ్ కోసం చింతల స్పోర్ట్స్​సంస్థ ఇచ్చిన 20 లక్షల రూపాయలను జిల్లా సంఘాలకు కేటాయించకుండా స్వాహా చేశారని తెలిపారు. ఏజీఎం, ఈసీ సమావేశాల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే నిధులను ఖర్చు చేశారని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఫిర్యాదు చేయటంలో జాప్యం జరిగిందని తెలియచేశారు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read; Swetcha Effect: నకిలీ విత్తనాల దందాపై.. స్పందించిన ప్రభుత్వం!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు