Suchata On Prabhas Movie
Viral, తెలంగాణ

Opal Suchata: ప్రామిస్ ప్రభాస్ సినిమా చూస్తా.. మిస్ వరల్డ్ చెప్పిన మూవీ ఏంటో తెలుసా?

Opal Suchata: మిస్ వరల్డ్ థాయిలాండ్ భామ ఓపల్ సుచాత చౌహన్‌ శ్రీ (Opal Suchata Chuangsri) విజేతగా నిలిచిన తర్వాత ‘స్వేచ్ఛ- బిగ్‌ టీవీ’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, బట్టలు, ఆభరణాలు.. ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చూస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు? ఇంత ఆ సినిమా సంగతేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also- Narayana Murthy: రాజ్యసభకు పీపుల్స్‌స్టార్ నారాయణ మూర్తి.. ఏ పార్టీ తరఫునంటే?

ప్రామిస్ చూస్తా.. రివ్యూ ఇస్తా!
‘ నేను బాహుబలి (Bahubali) సినిమా గురించి చాలా విన్నాను. కానీ ఇంతవరకూ మూవీ చూడలేదు. మిస్ వరల్డ్ పోటీలు పూర్తయ్యాక తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు, నేనే ప్రామిస్‌ చేసుకున్నాను. మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా బహుబలి మూవీపై రివ్యూ కూడా ఇస్తాను. ఇండియా నుంచి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టం అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్‌ను ఫినాలేలోనే కలిశాను. అదే విధంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) అంటే చాలా ఇష్టం. ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. వీలు ఉన్నప్పుడల్లా సినిమాలు చూస్తుంటాను. బాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా సినిమాలు ఇప్పటికే చూశాను. హీరోయిన్ అలియాభట్ (Aliya bhat) నాకు బాగా తెలుసు. గంగూబాయి కాఠియావాడి (Gangubai Kathiawadi) అంటే నాకు ఎంతో నచ్చింది. ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమా. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీని కూడా సందర్శించా, నాకు చాలా నచ్చింది’ అని ఓపల్ సుచాత వెల్లడించారు.

Suchata Chuangsri

Read Also- Miss World 2025: భారత్‌కు నిరాశ.. మిస్ వరల్డ్‌గా నిలిచింది ఎవరంటే..?

ఎంతో ప్రేమగా..
తెలంగాణ ప్రభుత్వాన్ని, హైదరాబాద్‌ నగరంపై మిస్ వరల్డ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ తెలంగాణ టూరిజం (Telangana Tourism) చాలా బాగా మిస్ వరల్డ్ కార్యక్రమం నిర్వహించింది. ఒక బెస్ట్ మెమొరీగా ఎప్పటికీ ఇది గుర్తిండిపోతుంది. ఇక్కడి కల్చర్‌, దుస్తులు, ఫుడ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ అందమైన ప్రదేశాలను చూసి ఎంజాయ్‌ చేశాం. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమగా ఉంటారు. తెలంగాణ నాకు ఇంటిని మరిపించింది. ఇక్కడ సంప్రదాయాలు, సంస్కృతి నాకు ఎంతగానో నచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. నాకు అవకాశం ఉంటే మళ్లీ హైదరాబాద్‌కు వస్తాను. ఇక్కడ చాలా మంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అని ఓపల్ సుచాత ఎంతో హ్యాపీగా ఫీలవుతూ చెప్పారు.

Suchata Miss World

Read Also-Opal Suchata: చెప్పి మరీ గెలిచిన ఓపల్‌ సుచాత.. క్యాన్సర్ నుంచి మిస్ వరల్డ్ వరకు..!

వావ్.. బిర్యానీ!‘ హైదరాబాద్‌ బిర్యానీ (Hyderabadi biryani) బాగా నచ్చింది. ఇక్కడి ఫుడ్‌ని బాగా ఎంజాయ్‌ చేశాను. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాను. మిస్ వరల్డ్ అవ్వాలన్న నా కల ఇప్పటికి సాకారం అయ్యింది. ఇది నా జీవితంలో అద్భుతమైన రోజు. నేను ఎంతో గర్వపడుతున్నాను. వ్యక్తిగతంగానే కాకుండా థాయ్‌లాండ్‌ ప్రజలకూ ఇదొక మైలు రాయి. మా దేశానికి తొలి విజయం. ఇలాంటి రోజు కోసం మేము అంతా 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను. నా తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు. మా నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. మా అమ్మ ఇల్లు చూసుకుంటారు’ అని ‘స్వేచ్ఛ- బిగ్‌ టీవీ’తో మిస్ వరల్డ్‌ పంచుకున్నారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?