Actress Abhirami: స్టార్ హీరో కమల్ హాసన్, హీరోయిన్ త్రిష, శింబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ” థగ్ లైఫ్ “. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ విక్రమ్, అమరన్ ను మన ముందుకు తీసుకొచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ ను రిలీజ్ చేయబోతుంది. ఈ చిత్రం జూన్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Rangareddy Medchal: ఎఫ్‌టీఎల్ ఎందాక?.. ఈ జిల్లాల్లోనే 60శాతానికి పైగా చెరువుల్లో ఆక్రమణలు!
ఆ సీన్ పై రియాక్ట్ అయిన నటి అభిరామి
అయితే, ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీ వివాదాస్పదంగా మారింది. ఇక కమల్ హాసన్, నటి అభిరామి ముద్దు సీన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో చిత్రం బృందం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనగా, ఈ సీన్స్ పై నటి అభిరామి ఘాటుగా స్పందించారు.
Also Read: CM Revanth Reddy: గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
నేను నా ఇష్టంతోనే అన్ని చేశా..
నటి అభిరామి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ నిర్ణయాలను నేను గౌరవిస్తాను. ఆ సీన్స్ ను నేను నా ఇష్టంతోనే చేశాను. ఆ ఒక్క క్లిప్ కారణంగా నేను ఎన్నో మాటలు పడుతున్నాను. అంతే కాదు, ఎన్నడూ లేని నా మీద మితిమీరిన ట్రోలింగ్ జరిగింది. నాదొక డౌట్ ఎవరైనా సినిమా చూసి జడ్జ్ చేయాలి. కానీ, అసలు సినిమానే చూడకుండా నా పాత్రను ఎలా నిర్ణయిస్తారు. పూర్తి మూవీ చూసిన తర్వాత నెటిజన్స్ అభిప్రాయాలు మారుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. సినిమా రిలీజ్ తర్వాత ఈ చర్చ గురించి ఆపేస్తారని అనుకుంటున్నాను. వాస్తవానికి దీనిపై దీని గురించి మరి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా. తీర్పులు ఇచ్చే ముందు మూవీ కూడా ఒకసారి చూడాలని నేను కోరుతున్నాను” అంటూ ట్రోలర్లకు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది.
Also Read: Rakul On Kohli: కోహ్లీ చేసిన ఒక్క లైక్ కి ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు.. రకుల్ సంచలన కామెంట్స్
దీనిపై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే కాలంలో అందరికీ ఇదొక ట్రెండ్ లాగా అయిపోయింది. మీరేం పట్టించుకోకండి మేడమ్.. జనాలు అన్నాక ఏదొక మాట అంటూనే ఉంటారంటూ నటి అభిరామికి సపోర్ట్ చేస్తున్నారు.