Manchu Manoj
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: డీఎన్ఏ‌ లోనే ఉంది.. నాన్న దగ్గర నుంచి వచ్చిన గొప్ప ఆస్తి అది!

Manchu Manoj: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించిన ఈ సినిమా మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read- Sri Sri Sri Rajavaru: ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా విడుదలవుతోంది

సినిమా చూసిన అందరూ మీ వాయిస్, డిక్షన్ నాన్నగారిని తలపించింది అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అది డిఎన్ఏ. ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన గొప్ప ఆస్తి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సినిమా స్టార్టింగ్ నుంచి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకు, సోషల్ మీడియాకు, సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లకు.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇకపై కూడా నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరించుకుంటున్నాను.

నేను చేసిన గజపతి పాత్రకి చాలా డెప్త్ ఉంది. ఈ సినిమా విషయంలో డబ్బింగ్‌కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు. డైరెక్టర్ చాలా పవర్ ఫుల్ గా నా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమాకి పేరు వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టరే. మా కోస్టార్స్. ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఈ క్రెడిట్ డైరెక్టర్‌కే దక్కుతుంది.

Also Read- Pawan Kalyan: ఇకపై నెలలో 15 రోజులు.. రోజూ రెండు పూటలా.. పవన్ కీలక ప్రకటన

చాలా గ్యాప్ తర్వాత చేసినా.. ఎన్నో బెస్ట్ కాంప్లిమెంట్స్‌ని ఈ సినిమా నాకు ఇచ్చింది. ఒక్కటని చెప్పలేను.. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యాం అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నా ఇంట్రడక్షన్‌కి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అది చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. నా నుంచి పూర్తి స్తాయి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చూడాలని అంతా అనుకుంటున్నారు. నెక్స్ట్ ‘90 ML’ ఫేం శేఖర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా వస్తుంది. అది హైలి ఎంటర్టైన్మెంట్ సినిమా. టైటిల్ కూడా అదిరిపోయింది.. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. నాకింతటి సక్సెస్ ఇచ్చి.. మరోసారి గ్రాండ్ వెల్కమ్ పలికిన ప్రేక్షకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. కాగా, ఇకపై గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో మంచు మనోజ్ ప్రేక్షకులను పలకరించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?