MLA Mallareddy: తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ నాయకుల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒకరు. విద్యావేత్తగా, వ్యాపార వేత్తగా ఆయనకు రాష్ట్రంలో మంచి పేరుంది. అంతేకాదు ఆయన సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తన ఫన్నీ మాటలు, డ్యాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో మల్లారెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారా? అని ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. అటువంటి మల్లారెడ్డి.. ఒక సెన్సేషన్ వీడియోతో అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మల్లారెడ్డి.. టైమ్ మిషన్ జర్నీ!
మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University) ప్రమోషన్స్ లో భాగంగా ఏఐ వీడియో (AI Video)ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోను గమనిస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి.. టైమ్ మిషన్ (Time Mission)లో గతంలోకి ట్రావెల్ చేసినట్లు కనిపిస్తోంది. నాటి కాలం మహానీయులు గౌతమ బుద్ధుడు, పీఠాధిపతులు, చాణక్యుడు, స్వామి వివేకానంద, మధర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి వారిని కలిశారు.
మల్లారెడ్డి టైమ్ మిషన్ జర్నీ..
కాల గమనంలో బుద్ధుడు, చాణుక్యుడు, మదర్ థెరిస్సా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం వంటి ప్రముఖులతో మల్లారెడ్డి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/0MtCevuTKa
— BIG TV Breaking News (@bigtvtelugu) May 31, 2025
మహాత్ముల సూచనలు
టైమ్ ట్రావెల్ లో తమను కలిసిన మల్లారెడ్డికి మహాత్ములు కీలక సూచనలు చేశారు. తిరుగులేని భవిష్యత్తును నిర్మించే అద్భుతమైన కోర్సులను స్థాపించు మల్లారెడ్డి అంటూ ఆది శంకరాచార్యులు సూచించడం వీడియోలో చూడవచ్చు. విజ్ఞానం పంచే విద్యా సంస్థలు స్థాపించు అని బుద్దుడు.. రాజ్యాన్ని నిర్మించే విద్యావంతులను తయారు చెయ్యమని చాణిక్యుడు చెప్పడం కూడా గమనించవచ్చు. నాణ్యమైన విద్యతో యువతను మేల్కొల్పాలని స్వామి వివేకానంద సూచించగా.. అద్భుతమైన టెక్నాలజీ కోర్సులతో రేపటి సమాజాన్ని నిర్మించాలని ఏపీజే అబ్దుల్ కలాం మల్లారెడ్డికి చెప్పారు. గతంలోకి వెళ్లి మహనీయుల సూచనలు అందుకున్నట్లు మల్లారెడ్డి సృష్టించిన ఏఐ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: Flexies At Kavitha Home: కవిత ఇంటి ముందు ఆసక్తికర ఫ్లెక్సీలు.. ఆందోళనలో బీఆర్ఎస్!
నెటిజన్ల ప్రశంసలు
మల్లారెడ్డి ఏఐ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నీ క్రియేటివిటీ నెక్స్ట్ లెవల్లో ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. మల్లా రెడ్డి అంటే పేరు కాదని.. ఒక బ్రాండ్ అని ఆకాశానికెత్తుతున్నారు. కవిత వివాదంతో సొంత పార్టీ బీఆర్ఎస్ అల్లాడుతుంటే అవేమి పట్టించుకోకుండా మల్లారెడ్డి కాలేజీల ప్రమోషన్స్ లో మునిగిపోయారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తానికి మరోమారు మల్లారెడ్డి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చకు తావిచ్చింది.