Politics On Tirumala (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Politics On Tirumala: తిరుమల వేదికగా మళ్లీ రాజకీయ రచ్చ.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం!

Politics On Tirumala: దేశంలోని సుప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల ఒకటి. ఇక్కడి శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకొని పావనమవుతుంటారు. అటువంటి పవిత్రమైన తిరుమల ఆలయం.. ఏపీలో గత కొంతకాలం రాజకీయ వివాదాలకు వేదికగా మారుతోంది. ఇటీవల కాలంలో తిరుమల లడ్డు కల్తీ  (Tirumala Laddu adulteration) అంశం ఏ స్థాయిలో రాజకీయ దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. తిరుమల కేంద్రంగా అధికార టీడీపీ (TDP), విపక్ష వైసీపీ (YSRCP)ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అది మర్చిపోక ముందే తాజాగా మరోమారు తిరుమల ఆలయం.. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రంగా మారిపోయింది.

అసలేం జరిగిందంటే?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు ముగింపునకు చేరుకున్న నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లలో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి క్యూ లైన్లలో తీవ్ర అసంతృప్తికి లోనైన భక్తులు.. ‘టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు డౌన్ డౌన్.. ఈవో శ్యామల రావు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లతో తగిన సౌకర్యాలు కల్పించలేదంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

వైసీపీ రంగ ప్రవేశం
తిరుమల భక్తులు మండిపుతున్న వీడియోను విపక్ష వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. క్యూలైన్లలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu), ఈవో శ్యామలరావు (EO Syamala rao)ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించింది. అన్న ప్రసాదం, పిల్లలకు పాలు, మంచి నీరు లేక భక్తులు అల్లాడిపోతున్నారని రాసుకొచ్చింది. వీఐపీ దర్శనాలతో టీటీడీ ఈవో శ్యామలరావు, ఛైర్మన్ బీఆర్ నాయుడు బీజీగా ఉన్నారంటూ మండిపడింది. ఇప్పటికైనా స్పందించి సామాన్య భక్తులకు కనీస సౌఖర్యాలు కల్పించాలని నెట్టింట డిమాండ్ చేసంది. అంతేకాదు ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటూ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను వైసీపీ పార్టీ ప్రశ్నించింది.

క్షమాపణ కోరిన భక్తుడు
క్యూలైన్లలో టీడీపీ ఛైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చుట్టు పక్కనున్న వారితో చేయించిన భక్తుడు దర్శనానంతరం మీడియాతో మాట్లాడాడు. తనకు జ్వరంగా ఉందని, క్యూలైన్లో భక్తులకు అందించిన సాంబార్ రైస్ తినలేకపోయానని చెప్పారు. పాలు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. అప్పటికే చాలా సేపు క్యూలైన్ లో ఉండటం, పైగా జ్వరంతో ఉండటం వల్ల ఫ్రస్టేషన్ కు లోనైనట్లు సదరు భక్తుడు తెలిపారు. తర్వాత టీటీడీ సిబ్బంది తనకు పాలు అందించారని పేర్కొన్నారు. పవిత్రమైన ఆలయంలో తాను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని భక్తుడు వాపోయారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ కు క్షమాపణ తెలియజేశారు. తాను చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని.. ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. అయితే క్యూలైన్ లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి.. బయటకు రాగానే మాట మార్చడంపై వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని బెదిరించి ఇలా చెప్పించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ సంచలన ట్వీట్
తిరుమల అంశం తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో అధికార టీడీపీ ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. తిరుమల ఘటన వెనక మాజీ సీఎం జగన్ (YS Jagan) కుట్ర ఉన్నట్లు ఆరోపించింది. తిరుమలను అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. శుక్రవారం రాత్రి తిరుమలలో హడావిడీ చేసిన వ్యక్తి.. కాకినాడ రూరల్ కు చెందిన వైసీపీ నేత అని టీడీపీ (Telugu Desam Party)పేర్కొంది. అతడు మాజీ సీఎం జగన్ కు ప్రియ శిష్యుడని పేర్కొంది. అతని పేరు బద్దిలి అచ్చారావు అని.. 2022లో స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ ఛైర్మన్ గా జగన్ అతడికి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చింది. అటువంటి వారిని అడ్డుపెట్టుకొని జగన్ ఫేక్ రాజకీయం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా చేయాలని.. తిరుమల వెంకన్న స్వామితో మాత్రం పెట్టుకోవద్దని హితవు పలికింది.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు