Polavaram Project: తెలంగాణలో ఏపీ నిర్మించిన పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో జరిగే ముంపు ముప్పుపై సర్వే చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో కలిసి సీడబ్ల్యూసీ ముంపుపై జాయింట్ సర్వే నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణలోని 6 వాగులకు నష్టం జరుగుతుందని అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన సీడబ్ల్యూసీ ఆ ఆరు వాగులపైచేసే సర్వేలో సంజీవ్ పాల్గొంటారని పీపీఏ మెంబర్ సెక్రటరీ తెలిపారు. వాగులు గోదావరి నది కలిసే క్రాస్ సెక్షన్ల వద్ద స్టడీ చేయనున్నారు.
గోదావరి నదికి ఎడమవైపున తురుబాక వాగు కలిసే చోట 33 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు సర్వే చేయనున్నారు. ఏటపాక వాగు కలిసే 3.5 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 500 మీటర్లకు, మరో స్థానిక వాగు కలిసే చోట ఒక కిలోమీటర్ పరిధిలో ప్రతి 200 మీటర్లకు, ఏదుళ్లవాగు కలిసే చోట 19.5 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు, పెద్దవాగు కలిసే చోట 24 కిలోమీటర్ పరిధిలో ప్రతి 750 మీటర్లు, దోమలవాగు కలిసే చోట 23 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు ముంపు స్టడీ చేయనున్నారు.
Also ReadL: Telangana govt: టీచర్ల సర్దుబాటుకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
వాటికి సంబంధించి గోదావరి నది వద్ద అవి కలిసే ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఇటు దోమలవాగు.. కిన్నెరసాని నదిలో కలిసే చోటు, కిన్నెరసాని గోదావరిలో కలిసే చోటుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరింది. అదే విధంగా సీడబ్ల్యూసీతో పాటు సమాంతరంగా ఐఐటీ హైదరాబాద్‌తోనూ మన అధికారులు స్టడీ చేయించనున్నారు.ఐఐటీ హైదరాబాద్‌లోని హైడ్రాలజీ నిపుణుడు ప్రొఫెసర్ రేగొండ సతీశ్ కుమార్‌తో ముంపుపై సర్వే చేయించనున్నారు.
పోలవరం ప్రాజెక్ట్, గోదావరి నదికి భద్రాచలం టౌన్, ముఖ్యమైన నిర్మాణాలకు సంబంధించి జియోగ్రాఫికల్ కో ఆర్డినేట్స్‌తో లొకేషన్ అనాలిసిస్ చేయనున్నారు. గోదావరి నదీ ప్రవాహ తీరు, పూడిక, హైడ్రాలజీ వంటి వాటిపై దుమ్ముగూడెం నుంచి రాష్ట్ర సరిహద్దులకు వరకు, పోలవరం ప్రాజెక్ట్ లో 45.72 మీటర్ల వద్ద స్టోర్ చేస్తే దాని బ్యాక్ వాటర్ వరదతో రాష్ట్రంలో ఎంత మేర ముంపుంటుందో సర్వే చేయనున్నారు. గోదావరి కావేరి లింక్‌పై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) జూన్ 24న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read: Bandi Sanjay on BRS: నిజమే.. బీఆర్ఎస్ పొత్తు కోసం వచ్చింది.. బండి సంచలన కామెంట్స్