CM Revanth Reddy: గోశాలలపై సీఎం ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ
CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ

CM Revanth Reddy: తెలంగాణలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Hyderabad Command Control Centere) లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటిలో సీఎంఓ అధికారులతో (CMO Officials) పాటు పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

50 ఎకరాల విస్తీర్ణంలో
గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలతో పాటు వాటి అనుబంధ కళాశాలలు.. దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ధార్మిక సంస్థల భాగస్వామ్యం
ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా గోశాలలు ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. గోశాలల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Also Read: Botsa Satyanarayana: మహానాడు పెద్ద డ్రామా.. సీఎం ప్రసంగమంతా సొల్లే.. బొత్స ఫైర్

4 రోజుల్లో ఖరారు
సమీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశముంది.

Also Read This: Bandi Sanjay on BRS: నిజమే.. బీఆర్ఎస్ పొత్తు కోసం వచ్చింది.. బండి సంచలన కామెంట్స్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క