Singer Aditi Bhavaraju
ఎంటర్‌టైన్మెంట్

Dhandoraa: నటిగా మారుతున్న సింగర్.. ఎవరో తెలుసా?

Dhandoraa: స్టార్ సింగర్ ఇప్పుడు నటిగా మారుతున్నారు. ఎవరా సింగర్ అనుకుంటున్నారా? లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’ (Color Photo) తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని, ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) వంటి సూప‌ర్ హిట్ చిత్రంతో మరోసారి తమ బ్యానర్ ప్రతిష్టని ఇండస్ట్రీకి తెలియజేశారు. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ చిత్రం ‘దండోరా’. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

Also Read- Hari Hara Veera Mallu: సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా?

గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ ‘దండోరా’ సినిమాలో బ‌ల‌మైన ప్రేమ, క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప్రవర్తనలను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎగ్జయిటింగ్ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!

టాలీవుడ్ టాలెంటెడ్ సింగ‌ర్ (Tollywood Singer) అదితి భావ‌రాజు (Aditi Bhavaraju) న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి భావరాజు, ‘దండోరా’ చిత్రంలో న‌టనా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను ఇప్పటికే మేకర్స్ పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై భారీగా అంచ‌నాలు పెంచేసింది. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ఈ సందర్భంగా తెలియ‌జేశారు.

మురళీకాంత్ (Muralikanth) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మార్క్ కె. రాబిన్ సంగీతం, వెంకట్ ఆర్. శాఖ‌మూరి సినిమాటోగ్రఫీ, సృజ‌న అడుసుమిల్లి ఎడిటింగ్, క్రాంతి ప్రియం ఆర్ట్ వర్క్, రేఖా బొగ్గార‌పు కాస్ట్యూమ్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వచ్చిన సక్సెస్ ఫుల్ చిత్రం ‘కోర్ట్’లో మంగపతి పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించిన యాక్టర్ శివాజీ (Actor Shivaji) ఇందులో మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం ఆయన ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో సైతం చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అలాగే మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ కూడా సినిమాపై ఆసక్తిని కలగజేస్తున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Vivek Venkataswamy: రాష్ట్రంలో రెడ్ క్యాట్ కంపెనీలకు నోటీసులు ఇస్తాం: మంత్రి వివేక్!

Crime News: పనిచేస్తున్న సంస్థకే టోకరా.. కోటిన్నర విలువ చేసే నగలతో పరార్.. ఎక్కడంటే..?

SIM Box Scam: సిమ్​ బాక్స్ వ్యవస్థతో నయా మోసం.. ఎలా చేశారో తెలిస్తే షాక్ కావాల్సిదే..?

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రికి కొత్త బాస్‌ నియామకం.. ఎవరంటే..?

Teja Sajja: ‘మిరాయ్‌’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. చూసే వారికి గూస్‌బంప్స్ పక్కా!