Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరు కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఎలా మోత మోగుతుందో తెలియంది కాదు. టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar).. హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బిజీ నటిగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. ఈ మూవీకి సంబంధించిన వరలక్ష్మి శరత్ కుమార్ రాకింగ్ ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ కృష్ణ బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు, తొలిసారి ఆద్యంతం వినోదాన్ని కలిగించే పాత్రలో వరలక్ష్మి నటిస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) పై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశామని, అది సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.
Also Read- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ నిర్మాతలు. ‘అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం’ వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ఆమె పాత్రకి ఉన్న ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘‘సూపర్ స్టార్ కృష్ణ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందనేది కాన్సెప్ట్. హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామని అన్నారు.
Also Read- Dharma Chakram: చంద్రబాబు జైలు జీవితంపై ‘ధర్మచక్రం’.. ఇదే లేటెస్ట్ అప్డేట్!
నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.. వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణపై చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీగా రూపొందిస్తున్నాం. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పోలీస్ కంప్లెయింట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. దర్శకుడు సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు