Naa Anveshana Video on Bayya Sunny Yadav
ఎంటర్‌టైన్మెంట్

Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!

Naa Anveshana: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ అరెస్ట్‌పై ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. అతని గురించి చెబుతూ.. పాకిస్తాన్‌తో అతనికి ఎలాంటి లింకులు ఉన్నాయో వివరిస్తూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలీ వీడియోలో నా అన్వేష్ ఏం చెప్పారంటే..

‘‘యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ని NIA పోలీసులు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆయనని ఎందుకు అరెస్ట్ చేశారు? నాకు పాకిస్తాన్ వీసా వచ్చినా నేను ఎందుకు వెళ్లలేదు? టర్కీ వీడియోలు చేసి నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు. తర్వాత అజర్‌బైజాన్ వీడియోలు కూడా చేసి నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు? అనేది వివరంగా చెబుతాను. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇందులో చాలా ట్విస్ట్‌లు, మెలికలు ఉంటాయి. భయ్యా సన్నీ యాదవ్ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే, దాదాపు 3 సంవత్సరాలగా అతనిపై నేను బెట్టింగ్ యాప్స్ విషయంలో కోట్లాడుతున్నాను. ఈ విషయంలో అతను జైలుకి కూడా వెళ్లాడు.

ముందుగా భయ్యా సన్నీ యాదవ్‌ని NIA పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే.. అతను రెండు నెలల పాటు పాకిస్తాన్‌లో ఉన్నాడు. 10 ఏప్రిల్ 2025న పాకిస్తాన్ నుంచి అతను వచ్చాడు. మనకి పహల్గామ్ అటాక్ జరిగింది కూడా ఏప్రిల్ ‌లోనే. అతను వచ్చిన 10 రోజులకే అటాక్స్ స్టార్ట్ అవడంతో.. అందరిపై డౌట్స్ వస్తున్నాయి. అందుకే అక్కడికి వెళ్లిన వారందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా కేసు అందరికీ తెలుసు. విచారణ జరిపి ఆ అమ్మాయిని పట్టుకున్నారు. అలా ఎవరైతే పాకిస్తాన్ వెళ్లారో.. వాళ్లందరినీ పట్టుకుని విచారించడం మొదలు పెట్టారు.

Also Read- Dharma Chakram: చంద్రబాబు జైలు జీవితంపై ‘ధర్మచక్రం’.. ఇదే లేటెస్ట్ అప్డేట్!

మార్చిలో సన్నీ యాదవ్‌కి లుకౌవుట్ నోటీసులు వెళ్లాయి. అప్పటికే ఆయన బెట్టింగ్ యాప్స్ బీభీత్సంగా ఉన్నాయి. అతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేసి ఉండరు. అతను చేసిన బెట్టింగ్ యాప్స్ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ఏప్రిల్‌లో ఇండియాకు వచ్చిన అతను.. లాయర్లను పెట్టుకుని బెయిల్ తెప్పించుకున్నాడు. ఇక పాకిస్తాన్ వెళ్లిన వీడియోలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. పాకిస్తాన్ వెళ్లడం నా డ్రీమ్ అని చెప్పడం బాగా ఇబ్బంది అయ్యింది. అతను ఎప్పుడూ క్రేజీ మైండ్‌తో ఉంటాడు. అలా క్రేజీగా ఏదో చెప్పాలని చూశాడు. దేశం, ప్రపంచం ఎలా పోయినా నాకు అనవసరం. నాకు డబ్బు కావాలి అంతే అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటాడు.

ఇప్పుడు ఎన్ఐఏ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? అని.. అందరూ అక్కడే దొరికిపోతున్నారు. అతని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే.. గడిచిన మూడు సంవత్సరాల్లో వచ్చిన డబ్బులు చాలా తక్కువ. ఒక్క వీడియో కూడా వైరల్ అవలేదు. కానీ 6 అంతస్తుల బిల్డింగ్. ఒక జాగ్వార్ కారు. ఒక నార్మల్ కారు.. మూడు స్పోర్ట్స్ బైక్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? అంటే వీళ్లు చెప్పలేరు. బెట్టింగ్ యాప్స్ అని చెప్పలేడు. ఎందుకంటే, ఊరూ, పేరూ తెలియని యాప్స్‌ని అతను ప్రమోట్ చేశాడు. వాళ్లు ఎవరూ బ్యాంక్ అకౌంట్ల రూపంలో మనీ ఇవ్వరు. హవాలా రూపంలో క్యాష్ ఇస్తారు. అందులోనూ అతను రెండు నెలలు పాకిస్తాన్‌లో ఉండి వచ్చాడు. అక్కడ ఎవరెవరిని కలిశాడు? అనే ఎంక్వైరీ మొత్తం ఉంటుంది. అందుకే అంటారు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని. ఈ అబ్బాయి స్పైగా పని చేస్తున్నాడా? లేదా అనేది మాత్రం విచారణలోనే తెలియాలి.

కానీ ప్రస్తుతం ఇళ్లు, బైక్స్, కార్లు EMIలు కట్టడానికి డబ్బుల్లేవ్. వాళ్లకి డబ్బులు వచ్చే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయ్యాయి. అందుకే గిలగిలా కొట్టుకుంటున్నాడు. పాకిస్తాన్ వెళ్లిన వీడియోలు పెడితే ఏమైనా వైరల్ అవుతాయేమో అని వాటిని అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. జ్యోతి మల్హోత్రా కేసు అయినప్పుడైనా వెనక్కి తగ్గుతాడేమో అనుకున్నా. అప్పుడు కూడా అస్సలు తగ్గలేదు. పాకిస్తాన్ వెళ్లిన డేటా కేవలం 10 శాతం మాత్రమే అప్లోడ్ చేశాడు. ఇంకా 90 శాతం డేటా అతని దగ్గరే ఉంది. ఫేమస్ అయిపోవడానికి అక్కడ ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమేం చేశాడో అన్నీ ఉన్నాయి.

Also Read- Venky vs Nag: వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య వార్.. అస్సలు ఊహించలేదు కదా!

ఇంతకు ముందు ఎప్పుడూ భారతదేశ యూబ్యూబర్లు పాకిస్తాన్ వెళ్లిన దాఖలాలు లేవు. కేవలం ఆధ్యాత్మిక వీసా మాత్రమే ఉండేది. భారతదేశానికి సంబంధించిన గుడి, గోపురాలు ఏమైనా చూడడానికి మాత్రమే ఆ వీసా పని చేస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోయిందో.. పాకిస్తాన్ అందరికీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. నేను కూడా వెళ్లాల్సి ఉంది. కానీ నేను వెళ్లలేదు. నేను వెళ్తున్నానని వీడియో పెడితేనే దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంత క్రేజ్ ఉంటుంది. కానీ అది మనకు శత్రు దేశం. నేను ఎంత ప్రపంచ యాత్రికుడిని అయినా, శత్రు దేశం అన్న తర్వాత అది శత్రు దేశమే. దేశం పరువు పోయే పని ఏదీ చేయకూడదు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.

అజర్‌బైజాన్ వెళ్లాను. కానీ అక్కడి వీడియోలు అన్నీ డిలీట్ చేసేశాను. టర్కీ కూడా వెళ్లాను. అక్కడ ఓ 20 రోజులు ఉన్నాను. కొన్ని వీడియోలు కూడా చేశాను. కానీ నేను యూట్యూబ్‌లో ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే, ‘ఆపరేషన్ సింధూర్’ టైమ్‌లో అజర్‌బైజాన్, టర్కీ బాయ్‌కాట్ అన్నారు. మన భారతదేశం బాయ్‌కాట్ అంటూ, టూరిజం క్యాన్సిల్ చేసుకుంటే.. ఒక యూట్యూబర్‌గా నేను ఎలా ప్రోత్సహిస్తాను. అందుకే అన్నీ వీడియోలు డిలీట్ చేశాను. ఇప్పుడు సన్నీ యాదవ్ కూడా ఏం లేకుండా సురక్షితంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను కానీ, అతనికి చాలా బొక్కలు ఉన్నాయి. బీభత్సంగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాడు. ఒకానొక టైమ్‌లో నేను అతనితో యుద్ధం కూడా చేశా. నాపై రెండు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక ఎందుకులే అని కామ్ అయ్యా. కానీ 2025లో శృతి మించిపోయింది. అందుకే మళ్లీ అతనితో ఫైట్ మొదలు పెట్టాను. ఏం లేదు.. అసలు అతని సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? అని ఎంక్వైరీ చేస్తే చాలు దొరికిపోతాడు. పాకిస్తాన్ వీసాలు వస్తున్నాయి కదా.. అని వ్యూస్ కోసం పిచ్చెక్కి వెళ్లిపోమాకండి. ముఖ్యంగా యూట్యూబర్లకే నేను చెప్పేది. ఇంకా 197 దేశాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా తిరగండి. మన శత్రు దేశాల విషయంలో బాయ్‌కాట్ అన్నప్పుడు బాయ్‌కాట్‌గానే ఉండాలి..’’ అని అన్వేష్ ఇందులో చెప్పుకొచ్చాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్