Miss World 2025: తెలంగాణ (Telangana) లో మొట్టమొదటిసారి జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం(మే 31) గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ (Hydrabad) హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ పోటీలను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, ఇతర నాయకులు, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నారు.
ప్రతిష్టాత్మక ఈవెంట్
ఫైనల్ పోటీలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ స్పందించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, శనివారం సాయంత్రం హైటెక్స్‌లో ఫైనల్స్ ఉంటాయని తెలిపారు. మాజీ మిస్ వరల్డ్ కొత్తగా ఎంపికైన వారికి కిరీటం అందజేస్తుందని చెప్పారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని వివరించారు. 3,500 మంది నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్న ఆయన, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపైనా స్పందించారు. తనను వేశ్యలా చూశారన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. తానే పర్సనల్‌గా బహిరంగ విచారణ జరిపానని, మిల్లా మ్యాగీపై చట్టపరమైన చర్యలను ఈవెంట్ ఆర్గనైజేషన్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్వాహకులు అక్కడి కోర్టును ఆశ్రయించారని తెలిపారు.
Read Also- Dharma Chakram: చంద్రబాబు జైలు జీవితంపై ‘ధర్మచక్రం’.. ఇదే లేటెస్ట్ అప్డేట్!
విజేతను నిర్ణయించేది ఎలా అంటే..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భామలు తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వారిలో 40 మందిని ఎంపిక చేస్తారు. టాప్ 40 నుంచి తర్వాతి రౌండ్‌క 29 మందిని, అనంతరం 8 మందిని ఎంపిక చేస్తూ వెళ్తారు. ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి చొప్పున ఉండేలా నిర్ణేతలు చూస్తారు. తర్వాత ప్రశ్నల పోటీ ఉంటుంది. మహిళలకు సంబంధించినవే కాకుండా, ఇతర అంశాలపై పలు ప్రశ్నలు అడుగుతారు. తర్వాత 8 మంది నుంచి నలుగురిని ఎంపిక చేసి, ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారనే ఆఖరి ప్రశ్న వేస్తారు. వారు చెప్పే సమాధానాన్ని బట్టి విశ్వ సుందరి ఎవరనేది తేలిపోతుంది. చివరగా విజేతకు గత ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరింపజేస్తుంది. దీంతో వేడుక ముగిసినట్టే. పోటీ్లో ఇండియాను రిప్రెజెంట్ చేస్తున్న నందిని గుప్తా ఫైనల్ పోటీల్లో ఉన్నది.
మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగాయిలా..
– మే 3 నుంచి 8 వరకు వివిధ దేశాల ప్రతినిధుల ఆగమనం
– శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ సంప్రదాయరీతిలో ఆహ్వానాలు
– మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుక
– జయ జయహే తెలంగాణ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
– 108 దేశాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం
– మే 12న నాగార్జున సాగర్ బుద్ధవనం సందర్శన
– మే 13న చార్మినార్ సందర్శన.. హెరిటేజ్ వాక్, లాడ్ బజార్ షాపింగ్, చౌముహల్లా ప్యాలెస్‌లో విందు
– మే 14న వరంగల్ పోర్ట్, వేయి స్థంబాల గుడి, రామప్ప సందర్శన
– మే 15న యాదగిరిగుట్టలో దర్శనం, చేనేత గ్రామం పోచంపల్లి సందర్శన
– మే 16న హెల్త్ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పటల్ సందర్శన, మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి టూర్, హైదరాబాద్ శివారు ఎక్స్‌పీరియం ఎకో పార్క్ సందర్శన
– మే 17న గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్ ఫినాలే, రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన
– మే 18న భద్రతపై కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన, పాలనా కేంద్రం సచివాలయంలో కార్యక్రమం
– మే 21 శిల్పారామం, విక్టోరియా హోమ్ సందర్శన
– మే 22 శిల్పకళా వేదికలో టాలెంట్ ఫినాలే
– మే 23 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్
– మే 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ షో
– మే 26 బ్యూటీ విత్ పర్పస్, గాలా డిన్నర్
– మే 27 ఫైనల్ రిహార్సల్స్
– మే 31 మిస్ వరల్డ్ 2025 ఎంపిక, కిరీటధారణ
– జూన్ 2 రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ
Read Also- Mahesh Kumar Goud: ఈటల, హరీశ్ సీక్రెట్ మీటింగ్.. టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు