Bellamkonda Sai Sreenivas: హీరోలు గ్యాప్ తీసుకుని నారా రోహిత్ (Nara Rohith) , మంచు మనోజ్ (Manchu Manoj) , బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) లు ముగ్గురు కలిసి కలిసి నటించిన మూవీ “భైరవం” (Bhairavam). తమిళంలో తెరకెక్కిన “గరుడన్” మూవీకి రీమేక్ ఇది. ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ఆడియెన్స్ కు నచ్చే విధంగా తీశానని, ఇప్పటికే దర్శకుడు విజయ్ కనకమేడల పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అయితే, ఈ రోజూ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం, మిక్స్ డ్ టాక్ తో రన్ అవుతుంది. ఈ క్రమంలోనే చిత్రం బృందం గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తుంది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన కామెంట్స్ చేశాడు.
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ” నేను ఒక్క శనివారం తప్ప , మిగతా రోజులు ఎవర్ని కలవను. ఎందుకంటే, మన్ డే నుంచి ఫ్రై డే వరకు వర్క్ మీదే ఫోకస్ చేస్తా.. ఇంక వేరే వాటి కూడా ఆలోచించను. నా ఫ్రెండ్స్ నన్ను పార్టీలకు పిలిచిన కూడా వెళ్లలేదు. వాళ్ళను కూడా శనివారం రోజే కలుస్తా. శనివారం లేవడం లేవడమే మళ్లీ కింగ్ లాగా ఉంటాను. బీర్ మంచిగా తాగుతాను. నాకు ఇష్టమైన ఫుడ్ ను కడుపు నిండా తింటా. ఎక్కువ నా కంపెనీని ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Sabitha Indra Reddy: 2వేల ప్రభుత్వ స్కూళ్ల ను మూసేశారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
ఈ వీడియో చూసిన నెటిజన్స్ అన్న నువ్వు కూడా మాకు లాగే ఎంజాయ్ చేస్తావా, అయితే ఈ సారి శనివారం మా దగ్గరకు రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.