Venkatesh and Nagarjuna
ఎంటర్‌టైన్మెంట్

Venky vs Nag: వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య వార్.. అస్సలు ఊహించలేదు కదా!

Venky vs Nag: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), కింగ్ నాగార్జున (King Nagarjuna) ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ నడుస్తోంది. నిజంగా ఇది ఎవరూ ఊహించని వార్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య వార్ చూశాం. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ చూశాం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ చూశాం. ఇంకా చెప్పాలంటే.. కోలీవుడ్ హీరో విజయ్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య వార్ కూడా చూశాం. ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ గురించి చెప్పేదేముంది. అది ఎప్పుడూ ఉండేది. కానీ ఎప్పుడూ లేనిది కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం ఏంటో అర్థం కావడం లేదు. కలికాలం అంటే ఇదేనేమో!

Also Read- Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?

వాస్తవానికి నాగార్జున, వెంకటేష్ ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. వెంకటేష్ సోదరి (నాగ చైతన్య మదర్)నే మొదట నాగార్జున వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య బంధాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య, ఆ ఫ్యామిలీలకు చెందిన హీరోల మధ్య ఇప్పటి వరకు ఎప్పుడు వార్ నడవలేదు. ఆ కుటుంబ హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా ఎప్పుడూ గొడవలు జరగలేదు. ఎందుకంటే, ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య కూడా వార్ (Fan War) నడుస్తోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ దూషించుకుంటున్నారు.

Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!

ఇంతకీ వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవకి కారణం ఏమిటో తెలుసా? నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రం. వాస్తవానికి ఆ సినిమా నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని.. వెంకటేష్ నటించిన ‘ధృవనక్షత్రం’ అనే సినిమా నుంచి యాజిటీజ్‌గా కాపీ చేసిపడేశారు. ఆ సినిమాలోని వీడియోని, ‘భాయ్’ సినిమాలోని వీడియోని ఒకచోట చేర్చి.. 1989లో మా విక్టరీ వెంకటేష్ బాబు నటించిన సూపర్ హిట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ధృవనక్షత్రం’ చిత్రాన్ని 24 సంవత్సరాల తర్వాత 2013లో నాగార్జున్ ‘భాయ్’ అంటూ ఫ్రీమేక్ చేసి, సీన్ టు సీన్ లేపేసి డిజాస్టర్ కొట్టాడు. కాపీ కొట్టడంలో ట్రెండ్ సెట్టర్ నువ్వులే భాయ్ అంటూ వెంకీ ఫ్యాన్స్ నాగార్జునపై విరుచుకుపడుతున్నారు.

దీనికి నాగ్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ.. అసలు ‘ధృవనక్షత్రం’ అనే సినిమా ఒకటుందని ఎవడికి తెలుసు? కథలు ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ హీరోలిద్దరి ఫ్యాన్స్ మధ్య.. ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. చూద్దాం.. ఈ యుద్ధం ఎంత వరకు వెళుతుందో! అయినా వారి పిచ్చిగానీ.. వెంకీ, నాగ్ ఎలా ఉంటారో తెలియదా? వారి మధ్య ఎప్పుడూ కూడా మంచి బాండింగే ఉంటుంది. ఫ్యాన్సే అతి చేస్తున్నారని.. ఇదంతా చూస్తున్న ఇతర హీరోల ఫ్యాన్స్ మాట్లాడుకుంటుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!