Rakul On Kohli ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Rakul On Kohli: కోహ్లీ చేసిన ఒక్క లైక్ కి ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు.. రకుల్ సంచలన కామెంట్స్

Rakul On Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) నటి అవనీత్ కౌర్ (avneet kaur) ఫ్యాన్ పేజ్ ని లైక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, కోహ్లీ చేసిన చిన్న పొరపాటు వలన యంగ్ బ్యూటీ అవనీత్ కౌర్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు పెరగడం వివాదంగా మారింది. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ (Rakul Preeth singh) దీనిపై సంచలన కామెంట్స్ చేసింది.

Also Read: Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలు అంతా గోప్యం.. కొంతమంది అధికారులకే సమాచారం?

చాలా బాధ వేస్తుందంటూ రకుల్ కామెంట్స్

రకుల్ మాట్లాడుతూ.. ” ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. చాలా బాధ వేస్తుంది. మనుషులు ఫ్రీగా ఉన్నారని తెలుస్తుంది. ఖాళీగా ఉన్నారని తెలుసు.. మరి పక్క వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతుందని అదే పనిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారంటే బాధగా ఉంది. కోహ్లీ ఒక్క లైక్ చేస్తే ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. అసలు ఇదెలా జరిగిందని ఎవరూ ఆలోచించలేదు? కావాలని లైక్ చేశాడా ? లేక పొరపాటున జరిగిందా? అని కూడా ఆలోచించనే లేదు. తప్పు ఉన్నా ? లేకపోయినా తప్పు జరిగినట్టే చేస్తున్నారు. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాము.

Also Read: L&T On Medigadda Barrage: మేడిగడ్డ కుంగడంలో మా తప్పేం లేదు.. మీ రిపోర్టే రాంగ్.. ఎల్అండ్‌టీ బుకాయింపు!

చిన్న లైక్ పెద్ద వివాదం 

కొన్ని సార్లు మన ఫ్రెండ్స్ ని కూడా తెలియక అన్ ఫాలో చేస్తుంటాము. అవి కూడా ఇప్పుడు పెద్ద వార్తలు అయిపోయాయి. కానీ, కోహ్లీ సెలబ్రెటీ కావడం వల్ల అతడి చేసిన చిన్న లైక్ కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇది చాలా విచారకరం!

ఇది మాట్లాడుకోవడం కూడా అనవసరం 

దీనిపై కోహ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జనాలు సెలెబ్రెటీలకు సంబంధించిన చిన్న విషయాలను కూడా ఆరాలు తీస్తున్నారు. దీని బట్టే తెలుస్తుంది.. ఎంత సమయాన్ని సోషల్ మీడియాలో(social media) వృధా చేస్తున్నారనేది? నన్ను అడిగితే దీని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమని అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!