Allu Arjun: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కొన్ని రూల్స్ తప్పక పాటిస్తారు. మరి కొందరు వాటిని బ్రేక్ చేస్తారు. కానీ, ఇటీవలే కాలంలో స్టార్ హీరోతో నటించిన హీరోయిన్లు, వారితో ఇతర పాత్రలు కూడా చేయడానికి సిద్దమవుతున్నారు. చిరంజీవితో నటించిన నయన తార, వేరే సినిమాలో చిరు కు చెల్లెలుగా నటించింది. ఇప్పుడు, తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు టాక్ నడుస్తుంది. మరి, ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
ఆ హీరోయిన్ అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటిస్తుందంటూ గత కొద్దీ రోజుల నుంచి వార్త వినపడుతోంది. అయితే, ఇది నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో అట.. ఇంతకీ అల్లు అర్జున్ కి చెల్లెలు వరుస అయ్యే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చూద్దాం..
అల్లు అర్జున్ కి చెల్లెలుగా ఆ స్టార్ హీరోయిన్ నటిస్తుందా?
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఒక బిగ్ ప్రాజెక్ట్ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది అల్లు అర్జున్ కెరియర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ గా తెరకెక్కనుంది. అయితే, ఇది మొత్తం రూ. 800 కోట్లని సమాచారం. ఈ రేంజ్ బడ్జెట్ అంటే, సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించకోవచ్చు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమా #AA22 ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఒకే అవ్వలేదు. అయితే, తాజాగా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కి ఓ స్టార్ హిరోయిన్ చెల్లెలుగా నటించబోతుందని టాక్ నడుస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ మలయాల నటి నజ్రియా నజీమ్.