Yamudu Teaser: ఈ మధ్యకాలంలో రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆ విషయం థియేటర్లు, ఓటీటీలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జగన్నాధ పిక్చర్స్ టీమ. జగదీష్ ఆమంచి (Jagadish Amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (Yamudu). ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేయగా.. తాజాగా చిత్ర టీజర్‌ని విలక్షణ నటుడిగా దూసుకెళుతోన్న నవీన్ చంద్ర (Hero Naveen Chandra) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?
టీజర్ విడుదల అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ.. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేసిన విధానం చాలా బాగుందని, యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోందని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని అన్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని అన్నారు. ఈ టీజర్‌ని గమనిస్తే.. (Yamudu Teaser Talk)

Also Read- Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే!
ఎవరిదీ శవం.. మర్డర్లు మరీ కామన్ అయిపోతున్నాయి ఈ సిటీలో అంటూ షాకింగ్ విజువల్స్‌తో టీజర్ మొదలైంది. ఒకవైపు లవ్ స్టోరీ నడుపుతూనే మరో వైపు అమ్మాయిల మర్డర్స్‌కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆసక్తి రేకెత్తించారు. ఈ చుట్టు పక్కల యముడి వేషం వేయాలంటే.. అంటూ హీరోని పరిచయం చేసిన తీరు, ఆయన చెప్పిన ‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా గూస్‌బంప్స్ అనేలా ఉన్నాయి. ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తిని కలిగించడంతో ఈ టీజర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మలిచినట్టుగా ఈ టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనేలా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ని మేకర్లు ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు