Megastar Chiranjeevi: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards 2024) పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 2024కు గానూ ఈ అవార్డ్స్‌కు ఎంపిక కాబడిన వారి వివరాలను జ్యూరీ ఛైర్ పర్సన్, నటి జయసుధ, తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని, ప్రతీది పరిశీలించిన అనంతరం ఫైనల్‌గా అవార్డు పొందిన విజేతలను ప్రకటించామని జయసుధ (Jayasudha) చెప్పుకొచ్చారు. ఈ అవార్డుల ప్రకటన అనంతరం, అవార్డు వచ్చిన వారంతా సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. అవార్డుకు ఎంపిక చేసిన వారికి, అవార్డును ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.
Also Read- Gaddar Film Awards 2024: గద్దర్ అవార్డ్స్ ప్రకటనతో.. ఓటీటీ సంస్థ సంబరాలు చేసుకుంటోంది
దాదాపు 14 సంవత్సరాల తర్వాత కళాకారులను ప్రోత్సహించే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డులను తీసుకురావడంపై.. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి కొనియాడుతున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డులపై ఎవరూ స్పందించని సమయంలో కూడా చిరంజీవి స్పందించి.. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఉత్తమ నటుడు అవార్డ్‌కు ఎంపికైన అల్లు అర్జున్, తన సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్‌కు అవార్డు రావడంపై ‘దేవర’ ఎన్టీఆర్.. సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. ఇతర అవార్డ్ గ్రహీతలు కూడా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్- 2024కి గానూ ఎంపికైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎవరికైనా సరే.. రాష్ట్ర గుర్తింపు అత్యంత విలువైనది. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం ఎంతో ప్రోత్సహాన్నిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు, అధికారులు, ఈ అవార్డుల కమిటీ మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Hearty Congratulations to each and
every winner of the First #GaddarTelanganaFilmAwards
for the year 2024. 👏👏State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity.
It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025
Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!
ఎవరి పేరు మెన్షన్ చేయాలో తెలీదా?
ఇదిలా ఉంటే, చిరంజీవి పోస్ట్‌కు అల్లు అర్జున్ అభిమానులు (Allu Arjun Fans) రకరకాలుగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇన్నేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని అవార్డులు ఇస్తుంటే.. ఆయనకి కృతజ్ఞతలు తెలపకుండా, అల్లు అర్జున్ పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు? అంటూ కొందరు అభిమానులు కామెంట్స్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. మేనల్లుడి పేరు మెన్షన్ చేయడానికి భయపడ్డావా? అంటూ మెగా ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నారు. దీనికి మెగాభిమానులే కాకుండా.. ఇతర హీరోల అభిమానులు కూడా కౌంటర్స్ ఇస్తుండటం గమనార్హం. చిరంజీవికి మీరు చెప్పే అంతటి వాళ్లా? ఆయనకు తెలియదా? ఎవరి పేరు మెన్షన్ చేయాలో? ఎవరి పేరు మెన్షన్ చేయకూడదో? అయినా అవార్డు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు కదా.. చాలదా!. అక్కడ అవార్డులు వచ్చిన వారంతా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. చిరు మెన్షన్ చేయాలంటే అందరి పేర్లు మెన్షన్ చేయాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా కామెంట్స్ చేస్తున్నార్రా? అంటూ అల్లు అర్జున్ అభిమానులకు గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు