Adi Srinivas: ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ కవిత కామెంట్స్ పై స్పందించారు. కవిత చేసిన కామెంట్స్‌తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని, బీజేపీ,బీఆర్ఎస్ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారిన అన్నారు. నేను మొదటి నుంచి చెబుతున్న అని నేడే కవిత కామెంట్స్‌తో నిజమేంటో నామాట నిజమైందని అన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారని అన్నారు. కవిత వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించాల్సిందే అని, ఇంతట్లో కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని కేటీఆర్ రాష్ట్రాన్ని ఇంకేదో ఉద్దరిమస్తామని అనడం, ఇక రాష్ట్రానికి ఎంచేస్తాడని అన్నారు. ఇంకేదో మాట్లాడుతున్నాడు.
డిల్లిలో డీల్ గల్లీలో దోస్తాన్ చేయడ అంతా తెలుసని అన్నారు. కేంద్రంలో బీజేపీతో డీల్ పైన బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని అన్నారు. రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నప్పటికి తెలంగాణ ప్రజలు మా వైవు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. గతంలో పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెగిపోయిందన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం ఎందుకు చెప్పడం లేదని అన్నారు.
Also Read: Telangana Politics: స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ కోసం పక్కా ప్లాన్?
ఏదేమైనా కవిత ఏపిసోడ్ లో కేటీఆర్, కేసీఆర్ స్పందించాలి. ఇంతవరకు కవిత లేఖ ఏలా లీక్ అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు చెప్పటం లేదని అన్నారు. శంషాబాద్ ఏయిర్ పోర్టులో కవిత దిగిన క్షణానే నేను పదకొండు ప్రశ్నలకు నేను లేవతనెత్తానని అన్నారు. వాటిలో కోన్నింటికి మాత్రమే సమదానం చెప్పారని, మిగతా విషయాలకు ఇంకా సమాదానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్, కేటీఆర్ కి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
Also Read: CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం.. సీఎం సంచలన వాఖ్యలు!