CM Revanth Reddy: ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తుందన్నారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాదన్నారు. హైదరాబాద్ లో బుధవారం సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి జయంతి, మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేర్లుపెట్టుకున్నామన్నారు.
వారి స్పూర్తితోనే విద్యార్ధులు మందుకు సాగాలనే భావన ప్రభుత్వానికి వచ్చిందన్నారు. కులాలు అనే అంశాన్ని పక్కకు పెట్టి విద్యతో ఉన్నతి స్తానాలను చేరేందుకు ప్రయత్నించాలని సీఎం కోరారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలన్నారు. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారన్నారు.
Alos Read: GHMC street lights: స్ట్రీట్ లైట్ల నిర్వాహణ ప్రైవేట్ పరం.. తేల్చిచెప్పిన జీహెచ్ఎంసీ!
కానీ మంచి చదువు అందించేందుకు చొరవ తీసుకోలేదన్నారు. ఆయా వర్గాలు గొప్ప గా మారితే రాజ్యాధికారాన్ని కోరుతాయనే భయం గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. కానీ తాము పవర్ లోకి వచ్చిన ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి విడుదల చేశామన్నారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించలేని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. గతంలో కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం పోతే, ఏడాది తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చారన్నారు.25 ఏళ్ల వరకు మంచి చదువు లభిస్తే, ఆ తర్వాత విద్యార్ధులు జీవితంలో గొప్పగా రాణిస్తారన్నారు. కష్టపడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడికి వీసీగా అవకాశం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. విద్యాకమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళికి ఇచ్చామన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజాప్రభుత్వంలో ఎంపిక చేశామన్నారు.
Also Read: KTR: కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నరాజకీయాలే చిల్లర.. కేటీఆర్ సంచలన కామెంట్స్!