deputy cm bhatti vikramarka slams pm modi కొందరికే దేశ సంపద.. దగ్గరుండి లూటీ చేయిస్తున్న మోదీ
bhatti vikramarka
Political News

Modi Govt: కొందరికే దేశ సంపద.. దగ్గరుండి లూటీ చేయిస్తున్న మోదీ

– విభజించు పాలించు నినాదమే బీజేపీ లక్ష్యం
– మోదీ పాలనపై భట్టి ఫైర్

హైదరాబాద్, స్వేచ్ఛ: బీజేపీ పాలనపై ప్రజా ఛార్జ్‌షీట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కొద్దిమంది స్నేహితులకు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. జనాభాను కులాలు, మతాలుగా విభజించి కల్లోలాలకు కారణమౌతోందని ఆరోపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేవి, ప్రస్తుతం మోదీ హయాంలో అదే ధోరణి కొనసాగుతోందని చెప్పారు. ‘‘గత పది ఏళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో చూశాం. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ గతంలో హామీ ఇచ్చారు. కానీ గత పది ఏళ్లలో ఈ హామీని అమలు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదవాళ్ల అకౌంట్లో 15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దేశంలో ఏ ఒక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పారు. పదేళ్లయినా ఈ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు.

మోదీ తన కొద్దిమంది క్రోనీ క్యాపిటల్స్ స్నేహితుల కోసం విదేశీ సంపదను ఎలా దోచిపెడుతున్నారో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి ఈ దేశ ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోదీ ప్రభుత్వం ఓవైపు, కులగణన చేసి అధిక శాతం ఉన్న జనాభాకు ఈ దేశ సంపదను అందించాలనే రాహుల్ గాంధీ మరోవైపు పోరాటం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, లౌకికవాదం, దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..